Natyam ad

తుఫాన్‌లో సహాయక చర్యలు -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

తుఫాన్‌ కారణంగా కురుస్తున్న వర్షాలలో చెరువులకు గండి పడకుండ సహాయక చర్యలు చేపడుతున్న ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌తో కలసి ఆయన మండలంలోని బోడినాయునిపల్లె చెరువు, లక్ష్మీపురం చెరువును సందర్శించారు. ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు చెరువులను పరిశీలిస్తున్నామన్నారు. పంటలకు , ప్రజలకు ఇబ్బంది కలగకుండ ఉండేందుకు సహాయక చర్యలు చేపడుతామన్నారు.గండి పడిన చెరువుకు ఇసుక సంచులను సిద్దం చేస్తున్నామన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటు నివారణ చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఈయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు సుబ్రమణ్యం, రమణ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Relief measures in the storm – MPP Bhaskar Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.