Natyam ad

పుంగనూరులో ముంపుకు గురికాకుండ సహాయ చర్యలు- పీడీ చంద్రశేఖర్‌

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని రాయలచెరువు, పుంగమ్మ చెరువులలో నీరు మరవ పోతుండటంతో పట్టణం ముంపుకు గురికాకుండ సహాయక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా డ్వామా పీడీ చంద్రశేఖర్‌ తెలిపారు. శుక్రవారం కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాతో కలసి చెరువులను ఆయన పరిశీలించారు. పట్టణంలో గతంలో ముంపుకుగురైన దోబీకాలనీ, మార్సక్నగర్‌, కోనేటిపాళ్యెం, ఉబేదుల్లాకాంపౌండు ప్రాంతాలలో పర్యటించి మాట్లాడుతూ ప్రస్తుతం కర్నాటక నుంచి వస్తున్న వరదనీటితో చెరువులకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ముందుజాగ్రత్తగా కళ్యాణ మండపాలు సిద్దం చేసి, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండ సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. చెరువుల్లో నీటి ఉధృతి తీవ్రమైతే తొలగించేందుకు జెసిబిలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈయన వెంట మున్సిపల్‌ డీఈఈ మహేష్‌, ఏఈ కృష్ణకుమార్‌, ఏపిడి శ్రీనివాసులు, వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్లు అమ్ము, నరసింహులు, పార్టీ నాయకులు రాజేష్‌, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Relief measures to avoid flooding in Punganur – PD Chandrasekhar

Post Midle