Religious and Musical Activities at Sri Kapileswaraswamy Brahmotsavam

శ్రీ క‌పిలేశ్వ‌రస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు

Date:14/02/2020

తిరుపతి ముచ్చట్లు:

తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌ సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న ధార్మిక‌, సంగీత‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా శుక్ర‌వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల వివ‌రాలిలా ఉన్నాయి.

శ్రీ క‌పిలేశ్వ‌రస్వామివారి ఆల‌య ప్రాంగ‌ణంలో ఉదయం 6 నుండి 6.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి కె.ఈశ్వ‌ర‌మ్మ బృందం మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి కె.ఇందిర బృందం శివ‌స్తోత్రం నిర్వ‌హించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ ఎం.వేంక‌టేశ్వ‌ర్లు ధార్మికోప‌న్యాసం చేశారు. సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి పి.జ‌యంతి సావిత్రి బృందం హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు. సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి వి.కృష్ణ‌వేణి బృందం అన్న‌మ‌య్య విన్న‌పాలు సంకీర్తనాలాప‌న, సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ ఎంబి.లోక‌నాథ‌రెడ్డి బృందం భ‌క్తి సంగీతం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ఊంజ‌ల్‌సేవ‌లో తిరుప‌తికి చెందిన శ్రీ కె.ఉద‌య‌భాస్క‌ర్ బృందం భ‌క్తి సంకీర్త‌న‌లు ఆల‌పించారు.

అదేవిధంగా తిరుపతిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన కె.స‌ర‌స్వ‌తిప్ర‌సాద్‌, జి.లావ‌ణ్య బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు.

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ

Tags: Religious and Musical Activities at Sri Kapileswaraswamy Brahmotsavam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *