ఎంపీ మిథున్ రెడ్డి కి మత సామరస్యం పరమత సహనం

కలికిరి ముచ్చట్లు:

ఎంపీ మిథున్ రెడ్డి కి మత సామరస్యం పరమత సహనం 2022పురస్కారం చిత్తూరు జిల్లా కలికిరి లో జరిగిన ముస్లిం మైనారిటీ ఆత్మీయ సదస్సులో అఖండ భారత నిర్మాణ సేవాసంఘం ఆధ్వర్యంలో అఖండభారత్ నిర్మాణ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ అఖండ భారత్ నిర్మాణ సేవాసంఘం ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్ సంయుక్తంగా పురస్కారాన్ని అందజేశారు .రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి  సేవలకు ఆయన మత సామరస్యం పరమత సహనం సోదర భావం వసుధైక కుటుంబం అనే సుగుణాలను ఆచరణాత్మక రూపం ఇచ్చి ఆదర్శoగా నిలిచి నందుకు ఈ పురస్కారాన్ని అందజేశారు. కార్యనిర్వాహకులు మాట్లాడుతూ మాతృభూమి భారత దేశం కోసం ప్రతి ఒక్కరూ ఇలాంటి సుగుణాలతో భారత దేశ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటాలని దేశ సుస్థిరత జాతీయ సమైక్యత దేశ అభివృద్ధి కోసం అఖండ భారత నిర్మాణ సేవాసంఘం అహర్నిశలు పనిచేస్తోందని వసుధైక కుటుంబం మా ఆశయమని ఈ ఆశయం కోసం తమ దైన శైలితో కార్యక్రమాల ను ముందుకు తీసుకెళ్తామన్నారు .ఈ కార్యక్రమంలో మైనార్టీ కమీషన్ ఛైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్.పీలేరు ఎమ్మెల్యే చింతెల రామచంద్రారెడ్డి.మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా.ఎమ్మెల్సీ జాకీయా ఖానం.ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ వేలాది మంది ముస్లిం మైనారిటీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post Midle

Tags:Religious harmony is the ultimate tolerance for MP Mithun Reddy

Post Midle
Natyam ad