రిమాండ్ ఖైదీ పరారీ…పట్టివేత

ఏలూరు ముచ్చట్లు:


రిమాండ్ ఖైదీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పరారీ అయ్యాడు.   అప్రమత్తమయని పోలీసులు ఖైదీని తిరిగి అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా వున్నాయి. ద్వారకాతిరుమల మండలం కొత్తపల్లి లో జరిగిన హత్య కేసులో ముద్దాయి రవితేజ రిమాండ్ లో వున్నాడు. నిందితుడికి అనారోగ్య కారణాలతో న ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో  వైద్య సదుపాయం కొరకు జాయిన్ చేసారు. అతనికి పోలీస్ కాపలా ఏర్పాటు చేసారు. సదరు ముద్దాయి రవి తేజ గురువారం అర్థ రాత్రి హాస్పిటల్  నుండి పారిపోయాడు. అతడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.  అతనిపై మరో కేసును నమోదు చేసారు. నిందితుడికి కాపలాగా ఉన్న పోలీస్ సిబ్బంది పై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు మరియు శాఖాపరమైన చర్యలు కొరకు సిఫార్సు చేసినట్లు సమాచారం.

 

Tags: Remand prisoner fugitive confiscation

Post Midle
Post Midle
Natyam ad