Natyam ad

రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేయండి

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు ప్రతి ఒక్కరు రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని రెండవ సారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని వైఎస్సార్‌పీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి కోరారు. శనివారం పట్టణంలోని నక్కబండలో ఇంటింటా ప్రచారాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, కౌన్సిలర్‌ మనోహర్‌తో కలసి నిర్వహించారు. అలాగే పిఆర్‌ఆర్‌ వారియర్స్ డాక్టర్లు శివ , ప్రభాకర్‌, శరణ్‌ ల ఆధ్వర్యంలో పలువురు పట్టణంలోని బైపాస్‌రోడ్డు, తాటిమాకులపాళ్యెం, ఆర్టీసి బస్టాండు వద్ద ప్రచారాలు చేశారు. అలాగే ఎన్‌ఎస్‌.పేటలో సీమజిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్లు రాఘవేంద్ర, భారతి ప్రచారాలు చేశారు.

 

 

Post Midle

చింతలవీధి, కట్టక్రిందపాళ్యెం ప్రాంతాలలో కౌన్సిలర్లు రెడ్డెమ్మ, రేష్మాతో పాటు భారత్‌ టైలర్ల సంఘం ప్రచారాలు చేశారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13న జరగబోవు ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారాలలో నానబాలగణేష్‌, రవి, రాజారెడ్డి,ఆవుల హరిప్రసాద్‌, శ్రీనివాసులు,రెడ్డెప్ప, పిఎల్‌.శ్రీధర్‌, మహేంద్రరావు, త్రిమూర్తిరెడ్డి, ఆర్‌కె.రామకృష్ణ, బాలకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సురేష్‌, ఎస్వీటి కిషోర్‌ , సలామత్‌, అంజాద్‌ , రామకృష్ణ, ఖాన్‌, నరసింహులు, ఖాదర్‌బాషా, రాఘవ, రషీద, తదితరులు పాల్గొన్నారు.

Tags: Remember two votes as a fan

Post Midle