Natyam ad

రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేయండి

పుంగనూరు ముచ్చట్లు:

ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి రెండవ సారి ముఖ్యమంత్రిగా జగన్నను గెలిపించాలని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా కోరారు. శనివారం పట్టణంలోని భగత్‌సింగ్‌ కాలనీలో కౌన్సిలర్‌ జయభారతి, స్థానిక నాయకులతో కలసి ఈవిఎంలపై అవగాహన కల్పించారు. అలాగే సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్‌ కిజర్‌ఖాన్‌, మహిళ నాయకురాలు సల్మా కలసి సుబేదారువీధిలో ప్రచారం చేశారు. బలిజ సంఘ నాయకులు , ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌, కౌన్సిలర్‌ నరసింహులు, నాయకులు డాక్టర్‌ ప్రభాకర్‌, నానబాల గణేష్‌, తుంగా మంజునాథ్‌, రాయల జగదీష్‌ , మాగాండ్లపల్లి ప్రభాకర్‌ లు ప్రచారం చేశారు. పట్టణంలోని తేరువీధి నుంచి మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్‌ పద్మావతి ఆధ్వర్యంలో మహిళలతో కలసి ర్యాలీ నిర్వహించారు. యూబికాంపౌండులో జిల్లా వక్ఫ్ బోర్డు  చైర్మన్‌ అమ్ము , మైనార్టీల నాయకుడు షామీర్‌ ఆధ్వర్యంలో ఈవిఎంలపై ఇంటింటా అవగాహన కల్పించారు. అలాగే కౌన్సిలర్లు పూలత్యాగరాజు, అర్షద్‌అలి, సాజిదాబేగం , కమలమ్మ, కాంతమ్మ, గంగులమ్మ, మమత, సుప్రియ, నయీంతాజ్‌, రాఘవేంద్ర, ఆదిలక్ష్మీ, రెడ్డెమ్మ, రేష్మా, కాళిదాసు, జెపి.యాదవ్‌, నటరాజ, భారతి, కమలమ్మలు వారి వారి వార్డులలో ప్రచారాలు చేశారు. అలాగే సుబేదారువీధిలో ముస్లింనాయకురాలు రహత్‌జాన్‌, జరీన్‌తాజ్‌ ఇంటింటా ప్రచారం చేశారు. కరపత్రాలు ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటమిధున్‌రెడ్డి లను అఖండ విజయంతో గెలిపించాలని వారు కోరారు.

Post Midle

Tags: Remember two votes fan

Post Midle