Natyam ad

రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి మమ్ములను గెలిపించండి- మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి మమ్ములను గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. బుధవారం పట్టణంలోని సాయిబాబాగుడివీధి, ఏవి.రావువీధి, కోనేటిపాళెం, తాటిమాకులపాళెం, పిఎల్‌ఆర్‌ బైపాస్‌రోడ్డు, షిరిడిసాయినగర్‌, దోబీకాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రికి మహిళలు నీరాజనాలు పలికారు. మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. కరపత్రాలు పంపిణీ చేసి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలను గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని ఆశీర్వదించాలన్నారు. ఎన్నికలలో ఓట్ల కోసం మాయమాటలతో వచ్చే ఉమ్మడి పార్టీ అభ్యర్థులకు తగిన గుణపాఠం నేర్పాలన్నారు. ఉమ్మడి పార్టీలు అధికారంలోకి వస్తే ప్రజలలో సోదరభావం సశించి , మతవిధ్వేషాలు చెలరేగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండవ సారి ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రచార కర్తలుగా ఉధ్యమించి, పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, కోఆఫ్షన్‌ మెంబరు తుంగా మంజునాథ్‌తోపాటు ఆయా వార్డు కౌన్సిలర్లు , అభిమానులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Remember two votes for the fan and let us win – Minister Peddireddy

Post Midle