రాజీవుని సేవలు చిరస్మరణం

-మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, గ్రేటర్ కాంగ్రెస్ పూర్వ అద్యక్షుడు కట్ల శ్రీనివాస్ రావు

Date:20/08/2020

వరంగల్  ముచ్చట్లు:

భారత రత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 76వ జయంతి సందర్బంగా మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, గ్రేటర్ కాంగ్రెస్ పూర్వ అద్యక్షుడు కట్ల శ్రీనివాస్ రావులు  వరంగల్ ఎంజిఎం జంక్షన్ లోని  రాజీవ్ గాంధీ విగ్రహానికి  పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  ఎర్రబెల్లి స్వర్ణ  మాట్లాడుతూప్ర‌పంచంలో అతి చిన్న వ‌య‌సులోనే (40)   గొప్ప ప్ర‌ధానిగా పేరు తెచ్చుకున్న మ‌హానీయులు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశంలో పంచాయ‌తీ రాజ్ వ్య‌వ‌స్థ‌లో సంస్క‌ర‌ణ‌ల‌కు ఆధ్యులు,స్థానికి సంస్థ‌ల‌కు అధికారాలు ఇస్తూ చ‌ట్టం చేసి గ్రామీణ పాల‌నా వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసి గాంధీజీ ఆశ‌యాల‌ను కొనసాగించారని ప్రశంసించారు. అనంతరం కట్ల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ యువ‌త‌కు 18 ఏళ్ళ వ‌య‌స్సులో ఓటు హ‌క్కు క‌ల్పించి యువ‌త‌ను రాజ‌కీయాల‌లో చురుగ్గా పాల్గొనేలా చేసిన సంస్క‌ర‌ణ క‌ర్త‌ రాజీవ్ అని పేర్కొన్నారు. ఐటి రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తెచ్చి దేశంలో సాంకేతిక విప్ల‌వానికి నాంది  ప‌లికిన పాల‌నా ద‌క్షులన్నారు. పంజాయ‌తీరాజ్ చ‌ట్టానికి ప్రాణం పోసి మూడంచ‌ల వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటుతో అధికారాలు అంద‌జేసి గ్రామీణ పాల‌నా వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు నిధులు, విధులు నిర్ణ‌యించి పంచాయ‌త్ రాజ్ చ‌ట్టంలోని 73, 74 చ‌ట్టాల‌కు స‌వ‌ర‌ణ‌లు చేసిన రాజీవ్ నేటి తరానికి స్పూర్తిదాయకుడని కట్ల శ్రీనివాస్ రావు వెల్లడించారు.

కోవిడ్ కు చికిత్స అందిస్తున్న నకిలీ ఆర్ఎంపి  అరెస్ట్

Tags:Remembrance of Rajiv’s services

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *