Natyam ad

పుంగనూరులో ప్రమాద విద్యుత్‌లైన్లు తొలగింపు – ఎంపీ మిధున్‌రెడ్డి

– ఉచితంగా నీరు

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

పట్టణ పరిధిలోని 31 వార్డులలోను ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌లైన్లు, స్తంభాలు ఎలాంటి ఖర్చు లేకుండ తొలగిస్తున్నట్లు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మున్సిపాలిటిలో మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌బాషా, చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌తో కలసి సచివాలయ ఉద్యోగులు, కౌన్సిలర్లు , అధికారులతో ఎంపీ మిధున్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ పట్టణంలోని కౌన్సిలర్లు, సచివాలయ ఉద్యోగులు, వలంటీ ర్లు, తమ ప్రాంతాల్లో ఉన్న ప్రమాదకర విద్యుత్‌లైన్లను గుర్తించి నివేదికలు అందించాలన్నారు. తక్షణమే వీటిని తొలగించి , ప్రజలకు ప్రమాదం లేకుండ చేస్తామన్నారు. ఇందుకోసం ప్రజలు డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, వైస్‌ చైర్మన్‌ లలిత, చింతపండు వ్యాపారుల సంఘ అధ్యక్షుడు ఎంఎస్‌.సలీం, కౌన్సిలర్లు కిజర్‌ఖాన్‌,అమ్ము, అర్షద్‌అలి, రెడ్డెమ్మ, రేష్మా, జయభారతి, భారతి తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ట్రాన్స్ఫార్మర్లు…

రైతులకు విద్యుత్‌ ట్రాన్స్ఫార్మర్లు తక్షణం అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి తెలిపారు. గత ఏడు సంవత్సరాలలో పుంగనూరు నియోజకవర్గానికి తక్కువ ట్రాన్స్ఫార్మర్లను కేటాయించి, రైతులను ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులను అన్ని విధాల ఆదుకునేందుకే ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. డిపాజిట్లు చెల్లించిన రైతుల జాబితాలను సిద్దం చేయాలని ఈఈ విజయన్‌ కు ఆదేశాలు జారీ చేశారు.

 

Tags: Removal of dangerous power lines in Punganur – MP Midhun Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.