పుంగనూరు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు ధ్వజస్తంభం తొలగింపు
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయము ముందున్న ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయ ఈవో కమలాకర్ ఆధ్వర్యంలో దీక్షితులు బాలసుబ్రమణ్యం, గ్రూప్ టెంపుల్స్ జూనియర్ అసిస్టెంట్ వెంకటరమణ, సిబ్బంది ఆధ్వర్యంలో ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించి జెసిబి సాయంతో తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ ఆలయం ముందున్న ధ్వజస్తంభం పూర్తిగా చేరుకోవడంతో భక్తాదులకు ఎటువంటి ఆటంకం చోటు చేసుకోకుండా ధ్వజస్తంభాన్ని తొలగించడం జరిగిందని త్వరలోనే ధ్వజస్తంభం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Tags: Removal of flag pole at Sri Kashi Visveshwara Swamy Temple, Punganur
