అక్రమ గుడిసెల తొలగింపు..ఉద్రిక్తత
మహబూబాబాద్ ముచ్చట్లు:
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇల్లందు రోడ్డు లోని ఆర్తీ గార్డెన్ వెనుక ఉన్న ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను పోలీసు బలగాలతో రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందితో తొలగించారు.పట్టణంలోని గుమ్మునూరు లో సర్వే నెంబర్ 287/1 ప్రభుత్వ భూమి 50 ఎకరాల 30 గుంటలు ఉంది. ఇటీవల ఈ భూమిలో ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణం కోసం అధికారులు కేటాయించారు. ఇదే అదునుగా భావించిన చుట్టూ ప్రక్కల నుండి వచ్చి కొందరు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. తెల్లవారు జామున రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పోలీసుల ప్రొటెక్షన్ తో జేసీబీ లతో తొలగించారు.గుడిసెలు తొలగిస్తున్న
అధికారులను అడ్డుకొని ఆందోళన చేస్తున్న గుడిసెవాసులను బలవంతంగా పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఎవరు గుడిసెలు వేయకూడదని, ఇల్లు లేని నిరుపేదలు అధికారులకు ఆర్జీ పెట్టుకోవాలని తహసీల్దార్ ఇమ్నాయిల్ తెలిపారు.
Tags: Removal of illegal huts..tension

