ఆలయభూముల్లో అక్రమ కట్టడాల తొలగింపు

పాలకొల్లు   ముచ్చట్లు:

 

 

పంచారామ క్షేత్రాల్లో ప్రసిద్ధి క్షేత్రమైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ భూములు అన్యాక్రాంతం అవడంతో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు,  ఆలయ ఈఓ యళ్ళ సూర్యనారాయణ వాటిని తొలగించారు. దేవస్థానం భూములు  బాజాభజంత్రీలు కు భుక్తి సాయం కింద 12 ఎకరాల కేటాయించడం జరిగింది. అప్పటి నుండి ఆ భూమీ పై  వారు ఏ విధమైన ఫల సాయం పండించుకుని తినే హక్కును దేవస్టానం  సంకల్పించింది. అయితే ఈ మధ్యకాలంలో ఆ భూముల్లో  శాశ్వత కట్టడాలు కట్టి వాటిని పూర్తి స్థాయిలో అక్రమన్నించుకొనే వారికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతో దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు, అధికారులు ఒక్కసారిగా పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను డోజర్ సాయంతో తొలగించడం జరిగింది. ఎవరైనా దేవస్థానం భూములను ఆక్రమించిన అన్యాక్రాంతం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆలయ ఈఓ యళ్ల సూర్యనారాయణ హెచ్చరించారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags:Removal of illegal structures on temple lands

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *