Natyam ad

పుంగనూరులో రోడ్డు దురాక్రమణ తొలగింపు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని గోకుల్‌  థియోటర్ వీధి చివరిభాగంలో రోడ్డును ఆక్రమించి కొంత మంది అడ్డంగా గోడ కట్టేశారు. విషయం తెలుసుకున్న కమిషనర్‌ నరసింహప్రసాద్‌ బుధవారం రాత్రి స్వయంగా సిబ్బందిని , పోలీసులను తీసుకెళ్లి దురాక్రమణను తొలగించారు. రోడ్డు చివరిభాగంలో ఉన్న స్థల యజమానులు రోడ్డుకు అడ్డంగా సిమెంటు ఇటుకలతో గోడ కట్టారు. దీనిపై ఆప్రాంత వాసులకు రాకపోకలకు ఇబ్బంది కలిగింది. అలాగే ఆప్రాంతంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు కూడ ఇబ్బందికరం కావడంతో ప్రజలు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. రికార్డులను పరిశీలించి , రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడను కమిషనర్‌ తొలగించారు. కమిషనర్‌ మాట్లాడుతూ అక్రమ కట్టడాలు, దురాక్రమణలు చేస్తే సహించేది లేదన్నారు. ఇలాంటి వాటిపై పోలీస్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Post Midle

Tags: Removal of road encroachment in Punganur

Post Midle