శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయ పునర్నిర్మాణం పనులు
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధం ఆలయం అయిన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయ పునర్నిర్మాణం పనుల్లో భాగంగా పరివార దేవతల మూలవిరాట్లు, ధ్వజస్తంభం తొలగింపు పంచనామ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఆలయ అధికారులు ఆధ్వర్యంలో పంచనామా చేసి విగ్రహాలు తొలగింపు పనులు చేపట్టారు. శ్రీ ప్రసన్న వరదరాజు స్వామి ఆలయాన్ని సుమారు నాలుగు కోట్లతో ఆధునికరణ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా బుధవారం ఆలయంలోని పరివార దేవతలు అయినా జయ విజయులు, ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు విగ్రహాలు ను ధ్వజస్తంభం తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు , రెవెన్యూ పోలీస్ దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో పంచనామా చేసి విగ్రహాలు తొలగించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం తొలగింపును పంచినామా చేసి తొలగింపు చేశారు.

Tags: Renovation works of Sri Prasanna Varadarajaswamy Temple
