అద్దె భవనాలే దిక్కు (మహబూబ్ నగర్)

Rental bungalow dike (mahabobnagar)

Rental bungalow dike (mahabobnagar)

Date:22/09/2018
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
జిల్లాలో కొత్త మండలాల వ్యవస్థ ఏర్పడి వచ్చే నెలతో రెండేళ్లు కావస్తోంది.. అప్పట్లో పలు కార్యాలయాల ఏర్పాటుకు సర్కారు భవనాలు అందుబాటులో లేవు. అప్పటికప్పుడు అద్దె భవనాలకు రంగులు వేయించి ఆర్భాటంగా కార్యాలయాలను ప్రారంభించారు. కాని ఆ భవనాలకు ప్రభుత్వం నెలకు రూ.లక్షల్లో అద్దెలు చెల్లిస్తున్నారు. మండల కేంద్రాల్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ కార్యాలయాల నిర్మాణానికి అడుగు వేయడం లేదు. అద్దెలకు రూ.కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. ఉన్న కార్యాలయాలు ఇరుకు గదుల్లోనే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 17 మండలాలను 2016 అక్టోబర్‌ 11న ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్రతి మండల కేంద్రాల్లో తహశీల్దార్, ఠాణా, వ్యవసాయ, విద్యాశాఖ అధికారి కార్యాలయాలను ఏర్పాటు చేశారు. మండలానికి ఒక కస్తూర్బా విద్యాలయాలను ప్రారంభించారు. కొన్నిచోట్ల ప్రభుత్వ భవనాలు ఉండటంతో వాటిలోనే ప్రారంభించారు. లేని చోట్ల భవనాలను అద్దెకు తీసుకుని వాటికి రంగులు వేయించి పూజలు చేసి ఆరంభించారు. ప్రారంభ సమయాల్లో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సంబురాల్లో పాల్గొన్నారు.
వాటిలో వసతులు లేకపోయిన దొరికింది అవే అన్నట్లు ఒక్కో కార్యాలయానికి అద్దెను దాదాపు రూ.వేలల్లో ఖరారు చేసి నిర్ణయించారు. వీటితో పాటు ఇటీవల మహిళా సమాఖ్య కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఇవి కూడ ఇరుకు గదుల్లో ఉండటం గమనార్హం. ఉన్న గదుల్లోనే మహిళా సిబ్బంది సమావేశాలను సాగిస్తున్నారు.
 మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కార్యాలయాలు ఇరుకుగా ఉండటంతో సిబ్బంది కూర్చుంటున్నారు. వారి పక్కనే ఫైల్లు అన్నింటిని ఉంచారు. విలువైన పైళ్లను ప్రత్యేక గదిలో భద్ర పరుస్తారు. కాని గదులు లేకపోవడంతో భద్రత కరవైందని అధికారులు పేర్కొంటున్నారు. ఉన్నత స్థాయి అధికారులు కార్యాలయాలను సందర్శించిన సమయాల్లో సమస్యలను గుర్తిస్తున్నారు.
కాని చేసేదేమి లేక మిన్నకుండిపోతున్నారు. కార్యాలయాల నిర్మాణాలకు ప్రభుత్వ స్థలాలను సర్వే చేయించారు. మండల విద్యాశాఖ అధికారి (ఎమ్మార్సీ భవనాలు) కార్యాలయాలకు మాత్రమే పక్కా భవనాల నిర్మాణాలకు ఒక్కో దానికి రూ.31 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. వాటికి సంబంధించి పనులు చేస్తున్నారు. ఆ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కస్తూర్బా విద్యాలయాల కోసం పలుచోట్ల స్థలాలు కేటాయించారు. కాని నిర్మాణాలకు నిధుల మంజూరునకు ప్రతిపాదనలు పంపారు. మిగతా కార్యాలయాలకు పక్కా భవనాల ఏర్పాటు పక్రియపై ఊసేలేదు.
కొత్త మండలాల్లో రెండు, మూడు కార్యాలయాల చొప్పున అద్దె భవనాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రతి నెలా వాటికి అద్దెలు మాత్రం రూ.లక్షల్లో చెల్లిస్తున్నారు. రెండేళ్ల నుంచి రూ.లక్షలు అద్దెలు చెల్లిస్తుండటంతో ఇప్పటి వరకు దాదాపు రూ.కోట్లల్లో ఇచ్చి ఉంటారు. కార్యాలయాల నిర్మాణాలకు మండలాల్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి.
ఆ స్థలాలను పక్కా భవనాలకు సమకూర్చి వాటిలో పక్కా భవనాలు నిర్మాణాలు చేస్తే ఇబ్బందులు తీరనున్నాయి. ఉన్నతాధికారులు పునరాలోచించి మండలాల్లోని కార్యాలయాలన్నింటికీ పక్కా భవనాలను నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Tags:Rental bungalow dike (mahabobnagar)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *