రేణుక సిమెంట్ భూనిర్వాసితుల ఆందోళన

అదిలాబాద్ ముచ్చట్లు:


అదిలాబాద్ రూరల్ మండలంలో రేణుక సిమెంట్ భూనిర్వాసితులు  ఆందోళనకు దిగారు.   మా భూములు మాకు తిరిగి ఇచ్చేయాలంటూ నిరసనకు దిగారు.  బీజేపీ నేత సుహాసిని రెడ్డి ఆద్వర్యంలో ఎడ్లబండ్ల తో ప్యాక్టరీ భూముల వరకు ర్యాలీ నిర్వహించారు. జీవో నెంబర్ 40 ప్రకారం మూడు ఏళ్ల లో ప్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసి, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు పరిశ్రమ పనులుప్రారంభించలేదని ఆందోళన చేసారు. భూనిర్వాసితుల ర్యాలీ ని పోలీసులు  అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఆదివాసీ భూ నిర్వాసితులకు పోలీసులకు మద్య తోపులాట జరిగింది. పురుగుల మందు డబ్బాలతో
భూ నిర్వాసితుల ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.

 

Tags:Renuka cement is the concern of land dwellers

Post Midle
Post Midle