Date:27/01/2021
ఖమ్మం ముచ్చట్లు:
సాగర్ కాల్వలో ఈతకు వెళ్లిన రేణుకా చౌదరి ప్రధాన అనుచరుడు, పీఏ నున్నా రవి గల్లంతయ్యారు. ప్రతి రోజూ మున్నేరు ఆక్వాడెక్ట్ బ్రిడ్జి వద్ద సాగర్ కాల్వలో దిగి ఈత కొట్టడం ఆయనకు అలవాటు. ఈరోజు కూడా బ్రిడ్జి దగ్గర బైక్ నిలిపి ఈత కోసం కాల్వలో దిగిన రవి… ప్రవాహంలో గల్లంతయ్యారు. రవి ఏకబిగిన పది కిలోమీటర్లయినా ఈత కొట్టగలడని.. గుండె పోటు లాంటి సమస్య రావడంతోనే ఆయన గల్లంతయ్యారని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.సాగర్ కాల్వలో రవి గల్లంతయ్యాడని తెలుసుకున్న రేణుకా చౌదరి ఆందోళన చెందారు. రవి తన బిడ్డ లాంటోడంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అతడు క్షేమంగా ఇంటికొస్తాడని ఆకాంక్షించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడానని.. అవసరమైతే కాలువలో నీటి ప్రవహం నిలిపివేయాలని సూచించానని చెప్పారు. రవి కోసం గాలింపు ముమ్మరం చేయాలని కోరారు.
ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళం
Tags: Renuka Chaudhary PA Gallanthu