పాక్ ఆర్మీకి సైనికులు రిప్లై

Repeat soldiers for Pak Army

Repeat soldiers for Pak Army

Date:14/08/2018
శ్రీనగర్ ముచ్చట్లు:
సరిహద్దుల్లో పాక్ సైన్యం ఆగడాలను ఇండియన్ ఆర్మీ సమర్ధంగా తిప్పికొట్టింది. మంగళవారం ఉదయం కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి పాకిస్థాన్ సైన్యం ఉల్లంఘించడంతో భద్రతా దళాలు ఎదురుదాడి చేసి శత్రువులకు తగిన బుద్దిచెప్పాయి.
ఈ ఘటనలో ఇద్దరు పాకిస్థాన్ సైనికులు హతమయ్యారు. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా తంగధర్‌లో పాకిస్థాన్ సైన్యం భారత పోస్టులపై కాల్పులకు పాల్పడటంతో ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. సైన్యం ఎదురుకాల్పుల్లో ఇదర్దు పాక్ జవాన్లు హతమైనట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ‘తంగధర్ సెక్టార్‌లో చొరబాట్లను ప్రోత్సహించే క్రమంలో సోమవారం రాత్రి పాకిస్థాన్ సైన్యం కాల్పుల ఉల్లంఘన ఒప్పందానికి పాల్పడి ఆర్మీ స్థావరాలపై కాల్పులు జరిపింది..
దీన్ని భారత దళాలు సమర్ధంగా తిప్పికొట్టి ఎదురు కాల్పులకు జరపడంతో ఇద్దరు పాక్ సైనికులు హతమయ్యారు’ అని రక్షణశాఖ అధికార ప్రతినిధి రాజేశ్ కాలియా తెలిపారు. ఉగ్రవాదుల చొరబాటుకు సహకరించడానికి పాక్ సైన్యం చేసిన ప్రయత్నాలను ఆర్మీ సమర్ధంగా తిప్పికొట్టిందని ఆయన పేర్కొన్నారు.
గత జులైలో పూంచ్‌ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి భారత ఆర్మీ పోస్టులు, పౌరుల నివాసాలే లక్ష్యంగా పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో టెరిటోరియల్‌ ఆర్మీ జవాన్, ఆయన భార్య మృతి చెందారు. వీరి పిల్లలు గాయపడ్డారు. పాక్‌ రేంజర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 224 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది.
Tags: Repeat soldiers for Pak Army

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *