8న కార్పొరేషన్ పదవుల భర్తీ

హైదరాబాద్ ముచ్చట్లు:

 

రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్‌ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవులను ప్రభుత్వం త్వరలో భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల 8వ తేదీన నియామకాలపై ప్రకటన చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు, డైరెక్టర్ల పేర్లపై ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ మరికొన్ని సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లకు సంబంధించి కులాల సయోధ్య కుదరలేదని సమాచారం.నిజానికి సీఎం వద్ద జాబితా ఆమోదం పొందిన వెంటనే సోమవారం నాడే పదవులను ప్రకటించాలని అనుకున్నారు. ఆమోదం పొందిన కార్పొరేషన్ల వరకైనా ప్రకటించాలన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. అయితే అన్ని కార్పొరేషన్లనూ ఒకేసారి ప్రకటించాలని సీఎం జగన్‌ స్పష్టం చేయడంతో జాబితా విడుదల చేయలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పదవులన్నీ సుమారు 80 వరకూ ఉంటాయని భావించినా.. 73 వరకూ లెక్క తేలాయని చెబుతున్నారు. జగన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ జయంతి రోజునే వీటన్నింటిని ప్రకటిస్తారని తెలుస్తోంది.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Replacement of Corporation posts on 8th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *