వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయం..కరోనా కోసం కొత్త పరికరం..

Date:03/04/2020

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలతో పాటు చెందుతున్న దేశాలతో పాటు అన్ని దేశాలు కరోనాతో సతమతమవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండడం అనుమానితులు భారీ సంఖ్యలో ఉండడంతో వారికి సత్వరమే వైద్య సహాయం అందించేందుకు తీవ్ర కష్టాలు పడుతున్నారు. వారికి వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. వైద్యులు వైద్య సిబ్బంది వైద్య పరికరాలు సామగ్రి కొరత తీవ్రంగా ఉంది. ఉన్న అరకొర సౌకర్యాలతో నడిపిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా బాధితుల కోసం సత్వరమే వైద్యం అందించాలనే ఆలోచనతో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. ఈ క్రమంలో మరో ఆవిష్కరణ చేశారు. వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయం కనుగొన్నారు.
కరోనా వైరస్ రోగులకు ఉపయోగపడే శ్వాస పరికరం ఒకదాన్ని వైద్యులు ఇంజినీర్లు మెర్సెడెస్ ఫార్ములా వన్ బృందం కలిసి వారం రోజుల్లో రూపొందించడం విశేషం. ఇది రోగులు శ్వాస పీల్చుకోవడానికి దోహదం చేస్తుంది. ఈ పరికరం వాడితే రోగులు ఇంటెన్సివ్ కేర్లో ఉండాల్సిన అవసరం ఉండదని పరిశోధకులు తెలిపారు. దీన్ని కంటిన్యుయస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ (సీపీఏపీ) అని పేరు పెట్టారు. ఈ పరికరాన్ని కరోనా వైరస్ బాధితులకు చికిత్స కోసం ఇటలీ చైనా ఆస్పత్రుల్లో ఉపయోగించారు. అయితే తీవ్ర కొరత ఉండడంతో లండన్ యూనివర్సిటీ కాలేజీ (యూసీఎల్) ఇంజినీర్లు యూనివర్సిటీ కాలేజీ లండన్ హాస్పిటల్ (యూసీఎల్హెచ్) వైద్యులు మెర్సెడెస్ ఫార్ములా వన్ బృందం ప్రతినిధులు కలిసి ఈ సీపీఏపీని పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ పరికరం వెంటిలేటర్ అవసరం లేకుండానే ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా అందించేందుకు ఉపయోగపడుతుంది. దీంతో వెంటిలేటర్ అవసరం లేకుండా ఈ పరికరం ఉపయోగపడుడుతండడంతో వైద్య సేవలు సత్వరమే అందించేందుకు అవకాశం లభించనుంది. ఈ బృందం కలిసి తయారుచేసిన 40 పరికరాలను యూఎల్సీహెచ్కు మరో మూడింటిని లండన్లోని ఆస్పత్రులకు తరలించి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. పరిశీలన అనంతరం ఫలితాలు మెరుగ్గా వస్తే వాటిని పెద్ద ఎత్తున తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మెర్సెడెస్-ఏఎంజీ-హెచ్పీపీ వీటిని రోజుకు వెయ్యి వరకు తయారు చేయగలదు. యూకేలోని మెడిసన్స్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) ఇప్పటికే ఈ పరికరాల వినియోగానికి అనుమతులిచ్చింది.

పోలీసులకు, మున్సిపల్‌ కార్మికులకు భోజనం

Tags:Replacement of ventilators .. New device for corona ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *