ఫారెస్ట్ రేంజర్‌ను సస్పెండ్‌ చేయాలని విలేకర్లు ధర్నా రాస్తారోకో

Reporters suspended by Forest Ranger

Date:25/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

అటవీప్రాంత భూముల కబ్జాపై వార్త రాసిన చౌడేపల్లె సాక్షి విలేకరి రసూల్‌ను దుర్భాషలాడిన పుంగనూరు రేంజర్‌ గోవిందరాజన్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండు చేస్తూ ఆదివారం విలేకరులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సంఘ ప్రతిన్యిధులు మురళి , జగన్‌మోహన్‌ , వసంతకుమార్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని పత్రికలకు, టివిఛానళ్లు, యూటూబ్‌ ఛానళ్లకు చెందిన విలేకర్లు కలసి ఫారెస్ట్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రేంజర్‌ గోవిందరాజన్‌ను సస్పెండ్‌ చేయాలని , ఆయన అవినీతి అక్రమాలపై దర్యాప్తు చేయాలని , అటవీ భూములను కాపాడాలంటు విలేకరులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ఫారెస్ట్ రేంజర్‌ తన విధి నిర్వహణలో పలు ప్రాంతాలలో అక్రమాలకు పాల్పడ్డారని , మహిళలను వేదింపులకు గురి చేయడంతో కేసులు నమోదు చేశారని , ఈ కేసులు విచారణలో ఉన్నాయన్నారు. ఇలాంటి అవినీతి ఆరోపణలతో ఉన్న రేంజర్‌ గోవిందరాజన్‌ విలేకరులను దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆయనపై కేసు నమోదు చేసి, సస్పెండ్‌ చేయాలని డిమాండు చేశారు. ఈ విషయమై పోలీసులు, అటవీశాఖాధికారులు తక్షణం చర్యలు తీసుకోకపోతే ఈనెల 28న బుధవారం జిల్లా స్థాయిలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ స్తంభించడంతో ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి విలేకరులతో చర్చించారు. ఫిర్యాదును కోర్టు అనుమతితో రిజిస్టర్‌ చేస్తామన్నారు. రేంజర్‌పై డిఎఫ్‌వో సునీల్‌కుమార్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన దీనిపై చర్యలు తీసుకుంటామని హామి ఇవ్వడంతో విలేకరులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లె వైఎస్సార్సీపి నాయకుడు గాజులరామ్మూర్తి , పెద్దిరెడ్డి యువజన సంఘ నేతలు రాజేష్‌, బండకుమార్‌, హేమంత్‌ తదితర విలేకరులు పాల్గొన్నారు.

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి

Tags: Reporters suspended by Forest Ranger

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *