ఇంద్రకీలాద్రిలో గణతంత్ర వేడుకలు

విజయవాడ ముచ్చట్లు:
 
గణతంత్ర దినోత్సవ సందర్భముగా ఆలయ పరిపాలనా కార్యాలయము, జమ్మిదొడ్డి లో  దేవస్థానము అధికారులు, సిబ్బంది  గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ పాలకమండలి ఛైర్మన్  పైలా సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ గారు, పాలకమండలి సభ్యులు ఎన్. సుజాత హజరయ్యారు. ఆలయ సెక్యూరిటీ అధికారులు అతిధులకు గౌరవ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఛైర్మన్, కార్యనిర్వహణాధికారి భారతమాత, జాతిపిత మహాత్మాగాంధీ వారి చిత్ర పటాలకు మంగళ లవాయిద్యములు, ఆలయ అర్చకుల మంత్రోచ్చరణల మధ్య పూలు, పండ్లు సమర్పించి పూజలు నిర్వహించారు.  అనంతరము వీరు ఎస్పిఎఫ్ సిబ్బంది, దేవస్థాన రక్షణ  సిబ్బంది గౌరవ వందనము అందుకున్నారు. తరువాత స్వాతంత్ర దినోత్సవ విశిష్టత గురించి, స్వాతంత్రోద్యమ నాయకుల గొప్పదనం గురించి ప్రసంగించారు. అనంతరం చిన్నారులకు, సిబ్బందికి    స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమములో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరు వార్లు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ లు, సహాయ కార్యనిర్వహనాధికారులు, పర్యవేక్షకులు, పొలిసు సిబ్బంది వారు, ఇంజినీరింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, మరియు ఇతర దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags; Republic Day celebrations at Indrakeeladri

Leave A Reply

Your email address will not be published.