Republican ceremonies as the grandeur of the Vadavada

వాడవాడల వైభవంగా గణతంత్ర వేడుకలు

Date:26/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

డబైఒకటవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. కోర్టు ఆవరణంలో న్యాయమూర్తులు బాబునాయక్‌, భారతి, రమణారెడ్డి , న్యాయవాదులు కలసి పతాకావిష్కరణ చేసి, వందన సమర్పణ చేశా అలాగే మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ ,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, తహశీల్ధార్‌ కార్యాలయంలో తహశీల్ధార్‌ వెంకట్రాయులు, పోలీస్‌స్టేషన్‌లో సీఐలు గంగిరెడ్డి, మదుసూదనరెడ్డిలు పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, ఉత్తమసేవలు అందించిన వివిధశాఖల అధికారులకు ప్రశంస పత్రాలు అందజేసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, అక్కిసాని భాస్కర్‌రెడ్డి , వైఎస్సార్‌సీపీ మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు త్యాగరాజు, అమ్ము తదితరులు పాల్గొన్నారు.

మండలంలో….

పుంగనూరు మండలంలోని రాంపల్లె వద్ద పుంగనూరు తొలి ఎమ్మెల్యే దివంగత బడాల కృష్ణమూర్తి ఇంటి వద్ద మనవడు ప్రసాద్‌ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే మండల పీహెచ్‌సీ కార్యాలయంలో డాక్టర్‌ సోనియా ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. గూడూరుపల్లె జెడ్పి హైస్కూల్‌లో హెచ్‌ఎం పురుషోత్తంరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే విలేజ్‌డెవలప్‌మెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.

71 వ గణతంత్ర దినోత్సవ0

Tags: Republican ceremonies as the grandeur of the Vadavada

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *