మందమర్రిలో పలు రైళ్ల హల్టింగ్ ఇవ్వాలని డి.ఆర్.ఎం కు  వినతి

మందమర్రి ముచ్చట్లు:


బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మందమర్రి రైల్వే స్టేషన్లో ప్రజల సౌకర్యం కోసం రామగిరి ప్యాసింజర్, కొత్తగూడెం సింగరేణి ప్యాసింజర్, సిర్పూర్ కాగజ్ నగర్ . హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ అలాగే త్వరలో ప్రారంభం కాబోతున్న అజ్ని ఎక్స్ ప్రెస్ లకు హల్టింగ్ ఇవ్వాలని సౌత్ సెంట్రల్ జోన్ డి.ఆర్.ఎం అభయ్ కుమార్ గుప్తా మంగళవారం మందమర్రి రైల్వే స్టేషన్ కు వచ్చిన సందర్భంగా బిసి సంక్షేమ సంఘంతో పాటు  పలు సంఘాల నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం వందలాది మంది ప్రయాణికులు సింగరేణి కార్మికులు, విద్యార్థులు, వ్యాపారస్తులు ప్రయాణం చేసే విలుండేదని రైళ్లు హల్టింగ్ లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అంతే కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోతున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందినవారూ ఈ ప్రాంతంలో సింగరేణి సంస్థ లో ఉద్యోగం చేస్తున్నారని సుమారు పట్టణంలో 60 వేల పై చీలుకు జనాభా నివసిస్తున్నారని ఆలాగే పట్టణానికి 20 గ్రామాలు అనుసంధానంగా ఉన్నాయని వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మందమర్రి రైల్వే స్టేషన్ లో రైళ్ల హల్టింగ్ కు చర్యలు తీసుకోవాలని డిఆర్ఎం కు వివారించారు.

 

 

అంతే కాకుండా మందమర్రి రైల్వే స్టేషన్లో మహిళలకు సరైన మరుగు దొడ్లు లేక ఇబ్బంది పడుతున్నారని ప్రయాణికుల సౌకర్యం కోసం మరుగు దొడ్లు నిర్మించాలని కోరారు.సమస్యలపై సానుకూలంగా స్పందించిన డిఆర్ఎం అభయ్ కుమార్ గుప్తా పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని హమి ఇచ్చారని తెలిపారు.అలాగే ఈ విషయంలో ఈ ప్రాంతా ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ బాల్క సుమన్,ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేత ప్రత్యేకంగా చొరవ చూపి రైళ్ల హల్టింగ్ కు సంభందిత అధికారులతో మినిష్టర్ తో మాట్లాడి పరిష్కరించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు కొండిల్ల శ్రీనివాస్,మండల అధ్యక్షులు నేరెళ్ళ వెంకటేష్, ఉపాధ్యక్షులు తడికొప్పుల రవిరాజా,కుర్రె శ్రీనివాస్, మందమర్రి పట్టణ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం కన్వీనర్ మొయ్య రాంబాబు,దళిత బహుజన సంక్షేమ సంఘం నాయకులు చీర్ల సత్యం,భగత్ సింగ్ యుత్ రాయబరపు కిరణ్,ఎండి జమాల్, తెలంగాణ కన్సూమార్ సంఘం నాయకులు దాటికొండ బెంజమెన్, సంఘాల నాయకులు పాల్గొన్నారు.

 

Tags: Request to DRM to give halting of many trains at Mandamarri

Leave A Reply

Your email address will not be published.