అభివృద్ధి పనులపై మంత్రి పెద్దిరెడ్డికి వినతి

చౌడేపల్లె ముచ్చట్లు:

తిరుపతిలో మంత్రి నివాసంలో బోయకొండలో అభివృద్ధి పనుల గురించి, మాస్టర్ ప్లాన్ గురించి, రహదారుల నిర్మాణం గురించి దేవస్థాన ఛైర్మన్ మిద్దింటి శంకరనారాయణ, ధర్మకర్తలు జె.వెంకటరమణారెడ్డి, పూర్ణిమా రాయల్ మోహన్, శ్రావణి భానుప్రకాష్ మరియు కార్యనిర్వహణాధికారితో చర్చించారు. షాపింగ్ కాంప్లెక్స్, మరియు పొంగల్ షెడ్ల పనులను ఆషాడమాసం మొదలయ్యేలోపల ప్రారంభానికి సిద్ధం చేయాలని కాంట్రాక్టర్ లను గట్టిగా హెచ్చరించారు. దేవస్థానం వద్ద కొత్తఘాట్ రోడ్డు నిర్మాణం, బండ్లపై రోడ్ నిర్మాణం చేపట్టవలసిందిగా పీఆర్ డీఈకి సూచించారు. దేవస్థానంలో అమ్మవారికి భక్తులు సమర్పించు పూలు, పూలమాలలని అలంకారం తర్వాత వృథాగా పార బోయ కుండా Flower waste management ద్వారా అగరుబత్తిలు, ధూపం తయారీకి ఆమోదముద్ర వేశారు. మాస్టర్ ప్లాన్ తయారీ పకడ్బందీగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూపొందించాల్సిందిగా సూచించారు.

Post Midle

Tags:Request to Minister Peddireddy on development works

Post Midle
Natyam ad