Natyam ad

ఛత్తీస్‌గఢ్‌లో రిజర్వేషన్లు 76 శాతానికి పెంపు

న్యూఢిల్లీ ముచ్చట్లు:

జనాభా దామాషా ప్రకారం వివిధ వర్గాలకు ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలను కల్పించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను ఛత్తీస్‌గఢ్ శాసన సభ ఆమోదించింది. ఈ బిల్లుల ప్రకారం రాష్ట్రంలోని షెడ్యూల్డు తెగలకు 32 శాతం, ఇతర వెనుకబడిన వర్గాలకు 27 శాతం, షెడ్యూల్లు కులాలకు 13 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 4 శాతం రిజర్వేషన్లు లభిస్తాయి.
ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ (షెడ్యూల్డ్ కేస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్) అమెండ్‌మెంట్ బిల్లు, ఛత్తీస్‌గఢ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (రిజర్వేషన్ ఇన్ అడ్మిషన్) అమెండ్‌మెంట్ బిల్లులను ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ శాసన సభలో ప్రవేశపెట్టారు. సుమారు 5 గంటల చర్చ అనంతరం ఈ బిల్లులకు శాసన సభ ఆమోదం లభించింది. ఈ బిల్లులపై చర్చకు బాఘెల్ సమాధానం చెప్తూ, రాష్ట్రంలోని ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారి సంఖ్యను నిర్దిష్టంగా తెలుసుకునేందుకు క్వాంటిఫయబుల్ డేటా కమిషన్‌ను గత బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయని ఆరోపించారు. తన ప్రభుత్వం 2019లో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల ఈ కమిషన్ కార్యకలాపాలకు అంతరాయం కలిగిందన్నారు. ఈ సవరణలను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలులో చేర్చాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరాలని అన్ని పార్టీల ఎమ్మెల్యేలను కోరానని చెప్పారు. శాసన సభ సభాపతి నేతృత్వంలో వెళ్లి మోదీని కలవాలని చెప్పానన్నారు.ఈ కమిషన్ నివేదిక ఇటీవలే ప్రభుత్వానికి అందింది. దీని ప్రకారం రాష్ట్ర జనాభాలో 42.41 శాతం ఓబీసీలు ఉన్నారు. 3.48 శాతం ఆర్థికంగా వెనుకబడినవారు ఉన్నారు.

 

 

శాసన సభలో ప్రతిపక్ష నేత నారాయణ్ చండేల్ మాట్లాడుతూ, క్వాంటిఫయబుల్ డేటా కమిషన్ నివేదికను శాసన సభలో ప్రవేశపెట్టలేదన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను కల్పించామని ప్రభుత్వం చెప్పుకుంటోందని, అయితే క్వాంటిఫయబుల్ డేటా కమిషన్ నివేదికను సభకు సమర్పించకపోవడం వల్ల సమాచారం నిర్దిష్టంగా లేదని పేర్కొన్నారు.
ఎస్సీలకు 16 శాతం, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. దీనికి ముఖ్యమంత్రి బాఘెల్ సమాధానం చెప్తూ, 2011 తర్వాత దేశంలో జనాభా లెక్కల సేకరణ జరగలేదని, ఈ ప్రక్రియ పూర్తయితే, దానికి అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించవచ్చునని చెప్పారు.

 

Post Midle

Tags: Reservation in Chhattisgarh increased to 76 percent

Post Midle