బి సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించలి 

Reservations in promotions to BC employees

Reservations in promotions to BC employees

Date:06/10/2018
బి.సి ఉద్యోగుల సంఘం రాష్ట్ర సమావేశం డిమాండ్
హైదరాబాద్ ముచ్చట్లు:
బి సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని క్రిమిలేయర్ ఎత్తివేయాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యానగర్ బి.సి భవన్ లో జరిగిన రాష్ట్ర  బి.సి ఉద్యోగుల సంఘo, విస్త్రుత స్థాయి సమావేశానికి ముఖ్య అతిదిగా ఆర్.కృష్ణయ్య విచ్చేసి ప్రసంగించారు. సమావేశాన్ని ఉద్దేశించి ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ బి.సి  ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టడానికి చట్టపరమైన, రాజ్యంగా పరమైన , న్యాయపరమైన అవరోధాలు, అడ్డంకులు ఏమీలేవు.
గతంలో పాలించిన కేంద్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం, బి సి వ్యతిరేక వైకరి అవలంబించడం మూలంగానే పెట్టలేదు. ప్రస్తుత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడి దశల వారిగా బి సి ల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా జాతీయ బి సి కమీషన్ కు రాజ్యాంగ బద్దమైన హోదా ఇచ్చారు. ఇక మిగిలిన బి సి ల 16 డిమాండ్లను కూడా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము.రాజ్యాంగ బద్దమైన మండల్ కమీషన్ బి సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సు చేసింది.
చట్టబద్దమైన పార్లమెంటరి కమిటీ చైర్మన్ నాచియప్పన్ కమిటీ బి సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సు చేసింది. ఇక ఇటివల సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ రిజర్వేషన్ల కేసు సందర్భంగా జనాభా ప్రకారం ఉద్యోగుల సంఖ్య లేకపోతే ఎస్సి/ఎస్టీ/బిసి లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని తీర్పు చెప్పింది. అన్ని వైపుల నుంచి బి సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సులున్నాయి. ఉంటే కానీ  కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్లలలో రిజర్వేషన్లు పెట్టకుండా బి.సి లకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
కేంద్రస్థాయి ఉద్యోగాలలో 54 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే బి సి ఉద్యోగులు కేవలం 4 లక్షల 62 వేలకే పరిమితం అయ్యారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పోరేషన్లు, బ్యాంకింగ్, రక్షణ రంగం నుండి మొదలుకొని రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాల వరకు బి సి లకు ప్రాతినిథ్యం లేదు. బి సి ఉద్యోగులు అటెండర్లు, వాచ్ మెన్లు గానే మిగిలిపోతూ, గెజిటెడ్ అధికారి కాకుండానే పదవి విరమణ చేస్తున్నారు.
మండల్ కమీషన్ సిఫార్సు ప్రకారం కేంద్ర ప్రభుత్వo ఉద్యోగ నియామకాలలో 27 % బి సి రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన 25 సంవత్సరాల తరువాత కూడా శోచనీయం. ఉద్యోగుల సంఖ్య 12.శాతం దాటకపోవడం బి సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించకపోవడం వల్లనే ఇంత అన్యాయం జరుగుతుందన్నారు.ఈ రోజు డిల్లీలో బి సి వర్గానికి చెందిన నాయకుడు నరేంద్రమోడి ప్రధానమంత్రి అయ్యారు.  ఇప్పుడైనా బి సి లకు ఇవ్వవలిసిన న్యాయమైన వాటా ఇవ్వకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. బి సి ఉద్యోగుల పోరాటం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఇతర పార్టీల మిశ్రమ ప్రభుత్వాలు, బి సి లకు అన్యాయం చేశాయి. అణచివేస్తూ వివక్షత చూపారు. ఉద్దేశ్యపూర్వకంగా కాలరాశారని కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.  మెజారిటీ ప్రజలైన 56 శాతం జనాభా గల బి.సి లకు దేశంలో రాష్ట్రపతి – ఉపరాష్ట్రపతి – లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంటి ఉన్నతి పదవులు ఇవ్వలేదు. బి సి లను కేవలం ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంటున్నాయని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వాలు వరుసగా 71 సంవత్సరాలుగా  బి.సి వ్యతిరేక వైఖరి అవలంభించాయి. కనీసం బి.సి వర్గానికి చెందిన ప్రధాని నరేంద్రమోడి ఇప్పుడైనా బి.సి లకు న్యాయంగా రావాల్సిన వాటా ఇస్తారని  ఆశిస్తున్నామన్నారు.   విద్యా, ఉద్యోగ నియామకాలలో బి.సి రిజర్వేషన్ల పై క్రిమిలేయర్ నిబంధన విధించిన తీరు బి.సి ల పై వివక్ష, చిన్న చూపు చూస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తుంది. ఆరు రిజర్వేషన్ల వర్గాలు ఎస్సి/ఎస్టీ/ వికలాంగులు/మహిళ రిజర్వేషన్లకు లేని క్రిమిలేయర్ బి.సి.ల కే ఎందుకు విధించారు? రిజర్వేషన్ల లక్ష్యం ఆర్ధికాభివృద్ధి  కాదు.
పాలన లో బి.సి. లకు భాగస్వామ్యం కల్పించడం ఒకటైతే – రిజర్వేషన్ల ద్వారా చదువు, ఉద్యోగం  తద్వార అధికారం లో ఈ వర్గాల సామజిక హోదా పెంచడం ఇంకొక భాగం. కాని అర్ధం-పర్ధం లేని క్రిమిలేయర్ బి.సి. లకే ఎందుకు కల్పించడం లేదు. ఇది బి.సి ల పట్ల వివక్షత కాదా? ప్రభుత్వాలు ఇంత చిన్న విషయం లో కూడా బి.సి లకు అన్యాయం చేశారని విమర్శించారు.  56 శాతం జనాభా గల బి.సి లకు రాజకీయంగా అసెంబ్లీ- పార్లిమెంట్ లో 14 శాతం ప్రాతినిధ్యం లభించడం లేదు.
దేశం లోని 29 రాష్ట్రాలలో 18 రాష్ట్రాల నుంచి ఒక్క ఎం.పి లేరు. 2500 బి.సి కులాలు ఉండగా 2550 కులాలు పార్లమెంటు లో అడుగు పెట్టలేదు. అందుకే చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు  పెట్టాలని కృష్ణయ్య గట్టిగా కోరారు. ఇది ప్రజాస్వామ్య హక్కు అని వివరించారు. ఈ సందర్భంగా బి.సి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అద్యక్షులుగా పల్లె ఉపేందర్ గౌడ్ ను ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో గుజ్జ కృష్ణ, జై హింద్ గౌడ్, కృష్ణుడు, నీలం వెంకటేష్, వేముల రామకృష్ణ, వేల్పుల బిక్షపతి, వన్నాడి రమ్య, ఎం. మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:Reservations in promotions to BC employees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *