చట్ట సభల్లో ఓసీబిలకు రిజర్వేషన్ కల్పించాలి టీబిసి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్

జగిత్యాల  ముచ్చట్లు :

పార్లమెంటు నుండి అసెంబ్లీ వరకు చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ బీసీ సంక్షేమ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు శనివారం టిబిసి ఐకాస జిల్లా శాఖ ఆధ్వర్యంలో చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అనే అంశంపై గూగుల్ మీట్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాలు పూర్తి అవుతున్న దేశ జనాభాలో 56 శాతం ఉన్న ఓబీసీలకు విద్య ఉపాధి రాజకీయ ఆర్థిక పారిశ్రామిక రంగాలలో తగిన వాటా దక్కలేదన్నారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ప్రకారం 73 సంవత్సరాల తరువాత కూడా బీసీల ప్రాతినిధ్యం 14 శాతం మించలేదని తేలిందని ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజార్టీ ఉన్న తగిన వాటా దక్కడం లేదని హరి అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ గణాంకాలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరాన్ని చాటుతున్నాయన్నారు ఈ క్రమంలో బీసీ వర్గానికి చెందిన మోదీ ప్రధానమంత్రి అయినందున టీబీసీ జేఏసీ గర్వపడుతుంది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు అలాగే జనాభాకు అనులోమానుపాతంలో రిజర్వేషన్లు అందించాలని సూచించారు వీటితో పాటు మరిన్ని డిమాండ్లను జిల్లాలోని వివిధ మండలాల టీబీసీ జేఏసీ అధ్యక్షులు కార్యదర్శులు విద్యార్థి మహిళా యువజన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక జేఏసీ నాయకులు సమావేశంలో ప్రస్తావించారు ఈసమావేశంలో ప్రధాన కార్యదర్శి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి విజయ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగం భాస్కర్ ఆకునూరి శంకరయ్య రుద్ర రవి యువజన జెఎసి అధ్యక్షులు కుసరి అనిల్ కుమార్ కార్యదర్శి పంబాల రామ్ కుమార్ యువజన రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి కృష్ణమూర్తి మహిళా జేఏసీ జిల్లా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి జిల్లా నాయకులు కొండా లక్ష్మణ్ ములస్తం శివప్రసాద్ ఉమ్మడి జిల్లా విద్యార్థి జేఏసీ అధ్యక్షులు దోనూరి భూమాచారి మరియు ఎనిమిది మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Reservations should be made for OCBs in the legislature
TBC JAC State President Hari Ashok Kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *