రాజీనామాలకు రెడీ : మంత్రి మాణిక్యాలరావు

Date:19/02/2018
అమరావతి ముచ్చట్లు:
రాజీనామాలు చేయమని అధిష్టానం ఆదేశిస్తే నిమిషంలో రాజీనామాలు చేస్తామని బీజేపీ నేత, ఏపీ దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యాలు చేసారు.  ఇప్పుడు అందరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు వున్నాయి .. సెకండ్లలో రాజీనామా ను స్మార్ట్ ఫోన్ ద్వారా మెయిల్ చేయొచ్చు. ఏపీలో టీడీపీతో పొత్తు విడిపోతే బీజేపీకి పెద్దగా నష్టం వుండదు. మేము ఇక్కడ వెంట్రుక లాంటి వాళ్ళం .. కొండకు వెంట్రుక వేసి లాగుతున్నాం .. వస్తే కొండ వస్తుంది .. పోతే వెంట్రుక పోతుందని అయన అన్నారు. బీజేపీతో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో మూడు పార్టీలు తెగతెంపులు చేసుకున్నాయని, ఏపీలో టీడీపీతో పొత్తు తెంచుకునే ఉద్దేశం తమకు లేదని మాణిక్యాలరావు చెప్పారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని త్వరలోనే ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఏపీ కేబినెట్లో ఉన్న బీజేపీ నేతలు రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లపై మాణిక్యాలరావు ఈ సందర్భంగా స్పందించారు. అధిష్టానం ఆదేశిస్తే నిమిషంలో రాజీనామా చేస్తామని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. బీజేపీతో టీడీపీ విడిపోయినా కేంద్ర ప్రభుత్వానికి పెద్దగా నష్టం ఏమీ లేదని ఆయన అన్నారు.
Tags; Resignation will be: Minister Manikala Rao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *