ఏపీలో వైసీపీ ఎంపీల రాజీనామాలు డ్రామాలే

Resignations of VCP MPs in AP are dramas

Resignations of VCP MPs in AP are dramas

Date:10/10/2018
విజయవాడ ముచ్చట్లు:
బీజేపీ-వైసీపీ మధ్య కుమ్మక్కు రాజకీయం జరుగుతోందన్నారు ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతిలో మాట్లాడిన మంత్రి.. వైసీపీ అధినేత జగన్‌ తీరుపై మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన స్థానాలకు ఉప ఎన్నికలు ఎందుకు రాలేదో జగన్ చెప్పాలన్నారు యనమల. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలకంటే ముందే కర్ణాటకలో ముగ్గురు ఎంపీలు రాజీనామాలు చేశారని.. ఆ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చినా.. ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. ఏపీలో వైసీపీ ఎంపీల రాజీనామాలు డ్రామాలేనన్నారు మంత్రి. ఈ ఐదు స్థానాలకు ఉపఎన్నికలు రాలేదంటే.. బీజేపీ-వైసీపీల మధ్య కుమ్మక్కు బైటపడిందని అర్థమవుతోందన్నారు.
ఎంపీలు రాజీనామా చేసిన చోట ఉప ఎన్నికలు రాకుండా.. వాటి రాజీనామాల ఆమోదంలో ఆలస్యం చేసింది ఎవరని ప్రశ్నించారు. స్పీకర్ పై ఒత్తిడి తెచ్చి 52రోజులు పాటూ ఈ వ్యవహారాన్ని నాన్చింది ఎవరో చెప్పాలన్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే టీడీపీ గెలుస్తుందనే భయంతోనే కుట్ర పన్నారని విమర్శించారు. ఉప ఎన్నికలు రాకుండా బీజేపీతో కలిసి కుట్ర పన్నారని విమర్శించారు యనమల. మోదీ, అమిత్ షా, జగన్ కుట్ర వల్లే బై పోల్స్ రాలేదన్నారు. కేంద్రం రాష్ట్రంపై రాజకీయంగా.. ఆర్థికంగా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు మంత్రి. తెలంగాణలోని 9 జిల్లాలకు రూ.450 కోట్లు విడుదల చేసి.. ఏపీలోని 7 జిల్లాలకు అన్యాయం చేయడాన్ని ఏమనాలన్నారు. రెండు రాష్ట్రాలలో వెనుకబడిన జిల్లాలకు సాయం చేయాలని ఒకే చట్టం చెప్పిందని.. మరి ఏపీకి ఇచ్చిన నిధుల్ని వెనక్కి తీసుకోవడం దారుణమన్నారు.
Tags:Resignations of VCP MPs in AP are dramas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed