అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి
కడప ముచ్చట్లు:
ప్రజా సమస్యల పరిష్కారార్థం ఏర్పాటు చేసిన “స్పందన” కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో.. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ “స్పందన” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తో పాటు జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ , ఇంఛార్జి డిఆర్వో, స్పెషల్ కలెక్టర్ రామమోహన్, డ్వామ, డిఆర్డీఏ పీడిలు యదుభూషన్ రెడ్డి, పెద్దిరాజు, అనుడ విసి శ్రీలక్ష్మి ,..లు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడారు ప్రజలు జిల్లా స్పందనలో అర్జీ ద్వారా కలెక్టర్ కు విన్నవించారు.ఈ కార్యక్రమంలో సిపివో వెంకట రావు, సమగ్ర శిక్ష పీడి ప్రభాకర రెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.నాగరాజు, మెప్మా పీడి రామమోహన్ రెడ్డి, రిమ్స్ సూపర్ ఇన్ టెండెంట్ డా.వెంకటేశ్వర రావు, ఎల్డిఎం దుర్గా ప్రసాద్, పంచాయతీ రాజ్ ఎస్ ఈ శ్రీనివాస రెడ్డి, ఆర్ & బి ఎస్ ఈ మహేశ్వర రెడ్డి, గృహనిర్మాణ శాఖ పీడి కృష్ణయ్య, ఎస్ సి కార్పొరేషన్ ఈడి వెంకట సుబ్బయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి బ్రహ్మయ్య, జిల్లా వ్యవసాయ శాఖాధికారి నాగేశ్వరరావు, అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Tags: Resolve applicant issues expeditiously