అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి

కడప ముచ్చట్లు:

 

ప్రజా సమస్యల పరిష్కారార్థం ఏర్పాటు చేసిన   “స్పందన”   కార్యక్రమం ద్వారా స్వీకరించిన  అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల  అధికారులను  జేసి సాయికాంత్ వర్మ ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో..    ప్రజా ఫిర్యాదుల స్వీకరణ “స్పందన”  కార్యక్రమం  జరిగింది.  ఈ  కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్  సాయికాంత్ వర్మ  తో పాటు , ఇంఛార్జి డిఆర్వో, స్పెషల్ కలెక్టర్ రామమోహన్, , డిఆర్డీఏ పీడి  పెద్దిరాజు. అనుడ విసి శ్రీలక్ష్మి….లు  హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.  ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ….  ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా  నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు.   పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలాఅర్జీలను పరిష్కరించా లన్నారు.

 

* కడప నగరం.. బెల్లం మండి వీధికి చెందిన ఎస్. ఫర్జాన్.. బుగ్గవంక విస్తరణలో భాగంగా తన ఇంటిని అధికారులు కూల్చివేయడం జరిగిందని.. దయచేసి తమకు న్యాయం చేయలని కోరుతూ జిల్లా స్పందనలో అర్జీ సమర్పించారు.ఈ కార్యక్రమంలో  సిపివో వెంకట రావు,  సమగ్ర శిక్ష పీడి   ప్రభాకర రెడ్డి,  రిమ్స్ సూపర్ ఇన్ టెండెంట్ డా.వెంకటేశ్వర రావు,  ఎల్డిఎం దుర్గా ప్రసాద్,  పంచాయతీ రాజ్  ఎస్ ఈ శ్రీనివాస రెడ్డి,  జడ్పి సీఈఓ సుధాకర్ రెడ్డి,  గృహనిర్మాణ శాఖ పీడి కృష్ణయ్య, ఎస్ సి  కార్పొరేషన్ ఈడి వెంకట సుబ్బయ్య అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Resolve applicant issues expeditiously

Leave A Reply

Your email address will not be published.