అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి
గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో అర్జీలు పరిష్కారం కాకపోతే నే జిల్లా కేంద్రానికి రావాలి
జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) గౌతమి
కడప ముచ్చట్లు:
ప్రజా సమస్యల పరిష్కారార్థం ఏర్పాటు చేసిన “స్పందన” కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) గౌతమి ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో.. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ “స్పందన” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) గౌతమితో పాటు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సాయికాంత్ వర్మ , డిఆర్వో మాలోల , ఐసిడిఎస్ పీడీ పద్మజ, డ్వామ పీడీ యదుభూషన్ రెడ్డి, ..లు హాజరై.. ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) గౌతమి మాట్లాడుతూ…. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పారదర్శకంగా అర్జీదారుడు సంతృప్తిచెందేలా పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన స్పందన పోర్టల్ ద్వారా.. ప్రజా సమస్యలను మరింత సులభతరంగా, నాణ్యతతో పరిష్కరించడంతో పాటు.. పరిష్కార నివేదికను కూడా సంబందిత పోర్టల్లో పొందుపరచాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. జిల్లా స్థాయి అధికారులను.. మండల ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని.. తహసీల్దారు, ఎంపిడివో, మున్సిపల్ కమీషనర్లు, రెవెన్యూ డివిజన్ పరిధిలో సబ్ కలెక్టర్, ఆర్డీవోలు ఆయా కేంద్రాల్లో అందుబాటులో వుంటారన్నారు. వారితో పాటు డివిజన్ స్థాయిలో డివిజనల్ అధికారులు కుడా అందుబాటులో ఉంటారన్నారు. కావున అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్ లలో అధికారులకు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్కడ తమ సమస్యలు పరిష్కారం కాకపోతేనే అర్జీదారులు స్పందన అర్జీల రసీదుతో జిల్లా కేంద్రానికి రావచ్చునన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గుర్తించి.. వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కలెక్టరేట్ లో జరిగే స్పందనకు హాజరై.. తమ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని ఆయన స్పష్టం చేశారు.
కొవిడ్ ప్రొటోకాల్ ను విధిగా పాటించాలి :
ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోనందున … అధికారులు, వారి సిబ్బంది, ప్రజలు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ … తరచుగా సానిటైజర్ తో కానీ సబ్బుతో కానీ చేతులను శుభ్రం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సాయికాంత్ వర్మ అన్నారు. కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించడం ద్వారా తమతో పాటు ఇతరులను కూడా కొవిడ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చునన్నారు. అనంతరం అర్జీదారులనుండి వారు అర్జీలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎంఐపి పీడి మధుసూదన్ రెడ్డి, సమగ్ర శిక్ష పీవో ప్రభాకర రెడ్డి, డిఎంహెచ్ఓ నాగరాజు, పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస రెడ్డి, సీపీఓ వెంకటరావు, స్టెప్ సీఈఓ రామచంద్రా రెడ్డి, ఎస్ సి కార్పొరేషన్ ఈడి వెంకట సుబ్బయ్య, డీఈఓ శైలజ, రిమ్స్ సూపర్ ఇన్ టెండెంట్ డా.ప్రసాద్, అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Resolve petitioners’ issues expeditiously