అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి
జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు
కడప ముచ్చట్లు:
ప్రజా సమస్యల పరిష్కారార్థం ఏర్పాటు చేసిన “స్పందన” కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో.. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ “స్పందన” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తో పాటు జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ , ఇంఛార్జి డిఆర్వో వెంకటేష్, డిఆర్డీఏ, ఏపీఎంఐపి పీడి మధుసూదన్ రెడ్డి, స్పెషల్ కలెక్టర్ రామమోహన్, అనుడ విసి శ్రీలక్ష్మి..లు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ…. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నార. అనంతరం అర్జీదారులనుండి వారు అర్జీలను స్వీకరించారు.
Tags: Resolve petitioners’ issues expeditiously