అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి-జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు.
కడప ముచ్చట్లు:
కడప కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కారార్థం ఏర్పాటు చేసిన “స్పందన” కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో.. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ “స్పందన” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తో పాటు జేసి సాయికాంత్ వర్మ, డిఆర్వో గంగాధర్ గౌడ్, డ్వామ, డిఆర్డీఏ పీడిలు యదుభూషన్ రెడ్డి, పెద్దిరాజు , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నరసింహులు … హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ…. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు.

Tags: Resolve the problems of the petitioners expeditiously-District Collector V.Vijay Ramaraju
