అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి-జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

కడప ముచ్చట్లు:

ప్రజా సమస్యల పరిష్కారార్థం ఏర్పాటు చేసిన   “స్పందన”   కార్యక్రమం ద్వారా స్వీకరించిన  అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల  అధికారులను  జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదేశించారు. అనంతరం  జడ్పి సర్వసభ్య సమావేశానికి కలెక్టర్ బయలుదేరి వెళ్లారు.సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో..    ప్రజా ఫిర్యాదుల స్వీకరణ “స్పందన”  కార్యక్రమం  జరిగింది.  ఈ  కార్యక్రమానికి ఇంఛార్జి డిఆర్వో  రామమోహన్,  అనుడ విసి శ్రీలక్ష్మి,రిమ్స్ సూపర్ ఇన్ టెండెంట్ డా.వెంకటేశ్వర రావు..లు  హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.  స్పందన ద్వారా.. ప్రజల నుండి  అందిన విజ్ఞప్తులలో కొన్నిసింహా ద్రి పురం మండలం అగ్రహారం  గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి వ్యవసాయ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని,మా పొలం చుట్టు పక్కల ఉన్న వారుసమస్యలు సృష్టిస్తూ మా వ్యవసాయ భూమికి దారి ఇవ్వడం లేదని ఈ సమస్యకు  పరిష్కారం చూపాలని  కోరుతూ స్పందనలో అర్జీ సమర్పించి యున్నారు.ఎర్రగుంట్ల మండలం మాలేపడు గ్రామానికి చెందిన ఇల్లూరు ఆదాం, మా గ్రామంలో 213/27 సర్వేనెంబర్ లో 1.50 సెంట్ల వ్యవసాయం భూమి మా తల్లిగారి పేరు మీద  ఉందని, తన తమ్ముడు ఆ వ్యవసాయ భూమిని ఆక్రమించుకున్నారని ఇందుకు సంబంధించి విచారణ జరిపి ఇద్దరికి సమానంగా పంచి తమకు న్యాయం చేయాలని   స్పందనలో అర్జీ  సమర్పించియున్నారుపెద్దముడియం మండలం పెద్ద పసుపల గ్రామానికి చెందిన గూడూరు చిన్న  గుర్రప్ప అనే వ్యక్తి సదరం సర్టిఫికెట్ అప్లై చేసి ఆరు నెలలు గడుస్తున్నా  ఇంతవరకు నాకు సదరం సర్టిఫికెట్ మంజూరు చేయలేదని,దీన్ని వెంటనే పరిష్కరించి నాకు సదరం సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరుతూస్పందనలోఅర్జీసమర్పించనున్నారుసికే దీన్నే మండలం ఇంద్రా నగర్ ,మామిల్ల పల్లి గ్రామానికి చెందిన తాటి వెంకటసుబ్బమ్మ అనే మహిళ ఓ టి యస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్ ను సచివాలయం నుండి డౌన్లోడ్ చేసి తమకు ఇప్పించవలసింది గా స్పందనలో అర్జీ సమర్పించుకున్నారు.ఈ కార్యక్రమంలో  వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Resolve the problems of the petitioners expeditiously-District Collector V.Vijay Ramaraju

Leave A Reply

Your email address will not be published.