Responding to YS Jaganmohan Reddy speech at BCCI conference

బీసీల సదస్సులో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రసంగంపై స్పందన

Date: 17/02/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జన సదస్సులో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌.జగన్మోహన్‌రె డ్డి బీసీలకు వరాల జల్లులు కురిపించారు. బీసీలకు బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. అసెంబ్లి తొలి సమావేశాలలోనే బీసీ సబ్‌ప్లాన్‌కు బిల్లును ప్రవేశపెడుతామన్నారు. ఇలాంటి ముఖ్యమైన ప్రకటనలతో బీసీల్లో అనూహ్య స్పందన లభిస్తోంది.

బీసీల పిల్లలను కలెక్టర్లు, డాక్టర్లు చేస్తామనడం …..

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే బీసీల పిల్లలను కలెక్టర్లు, డాక్టర్లు , ఇంజనీర్లను చేస్తామని ఇందుకోసం అవసరమైయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించడం అభినందనీయం. అలాగే బీసీ మహిళలకు 45 సంవత్సరాలు నిండితే రూ.75 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించడం హర్షనీయం. వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తండ్రికి మించిన తనయుడుగా బీసీలపై తన ప్రేమ ఎలాంటిదో ఏలూరు సభలో చాటుకున్నారు. యువకుడైన జగన్‌ ఆలోచనలకు ప్రతి ఒక్కరు మద్దతు ఇచ్చి, ఆయనను ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేయాలి .

– సరస్వతి, విశ్రాంత స్పెషలాఫీసర్‌ , పుంగనూరు.

కులానికొక్క కార్పోరేషన్‌తో అభివృద్ధి…..

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే బీసీల్లోని కులానికొక్క కార్పోరేషన్‌ను పెడుతామని వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రకటించడం హర్షనీయం. రాష్ట్రంలోని బీసీల్లో 139కులాలు ఉండగా , వాటన్నింటికి ఒకొక్క కార్పోరేషన్‌ ఏర్పాటు చేసి, ఆకులాలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తానని హామి ఇవ్వడం చరిత్ర సృష్టించడమే. బీసీలకు , ఎస్సీ, ఎస్టీ , మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం హర్షనీయం. ఏలూరు బీసీ గర్జన సభతో రాష్ట్రంలోని బీసిల జాతకాలు మారిపోనున్నాయి. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు బీసీలు సిద్దంకావాలి.

– కొండవీటి నటరాజ, పాత్రల వ్యాపారి, పుంగనూరు

 

హంద్రీనీవా కాలువలో పూజకెళ్లి యువకుడు మృతి

 

Tags; Responding to YS Jaganmohan Reddy speech at BCCI conference

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *