పారిశ్రామిక రంగంలోని సమస్యల పరిష్కారానికి స్పందన కార్యక్రమం

–  మంత్రి గౌతమ్ రెడ్డి

Date:22/10/2020

విజయవాడ  ముచ్చట్లు:

పారిశ్రామిక రంగంలోని సమస్యల పరిష్కారానికి స్పందన కార్యక్రమం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈమేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ అంశంపై అధికారులతో సమీక్షనిర్వహించారు. వచ్చే నెలలో పరిశ్రమల కోసం స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆ శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా పరిశ్రమల స్పందన కోసం ప్రత్యేక వెబ్ సైట్ రూపకల్పన చేయనున్నారు. ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులకు అందుబాటులో ఉండేలా పరిశ్రమల శాఖ పనిచేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్పందన వెబ్ సైట్ ప్రారంభించడం ద్వారా పారిశ్రామిక రంగంలో జవాబుదారీ, పారదర్శకత పెరుగుతుందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.  పరిశ్రమలకు సంబంధించిన ఎలాంటి సందేహం, ఫిర్యాదైనా సత్వరమే స్పందన ఉంటుందని తెలిపారు.  పరిశ్రమలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా గ్రీవెన్స్ స్వీకరించేలా ఈ వెబ్ సైట్ రూపొందుంతుందని మంత్రి వెల్లడించారు.మరోవైపు రాష్ట్రంలో బొమ్మల తయారీ పరిశ్రమలను ఆకట్టుకునేందుకు ఏపీ బొమ్మల తయారీ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి ఆదేశాలిచ్చారు.

చంద్రప్రభా వాహనంలో నవనీత కృష్ణ అలంకరం

Tags: Response program for problem solving in the industrial sector

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *