Natyam ad

పుంగనూరులో లయన్స్ క్లబ్‌ రక్తదాన శిబిరానికి స్పందన 

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని లయన్స్ క్లబ్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి స్పందన లభించింది. క్లబ్‌ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ శివ,  అధ్యక్షుడు త్రిమూర్తిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో 72 మంది రక్తదానం చేసేందుకు హాజరైయ్యారు. వీరిని పరీక్షించి 42 మంది రక్తాన్ని వైద్యులు రెడ్డికార్తీక్‌  ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది రక్తాన్ని సేకరించి, భద్రపరిచారు. దాతలకు సర్టిఫికెట్లను, అల్ఫహారాన్ని  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, రెడ్డిజన సంఘ నాయకుడు మహిపాల్‌రెడ్డి, క్లబ్‌ సభ్యులు మహేంద్రరావు, పిఎల్‌.శ్రీధర్‌, రఘునాథరెడ్డి, రజ్వి, సుధాకర్‌రావు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Response to Lions Club Blood Donation Camp at Punganur

Post Midle