Response to the eye clinic

కంటి వైద్యశిబిరానికి స్పందన

Date:25/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని విశ్రాంత ఉద్యోగులు సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్యశిబిరానికి అపూర్వ స్పందన లబించింది. సంఘ నాయకులు రామకృష్ణారెడ్డి, మునస్వామి వెహోదలియార్‌ ఆధ్వర్యంలో చెన్నైకు చెందిన శంకర్‌నేత్రాలయ ఆసుపత్రి వైద్యులు చికిత్సలు నిర్వహించారు. చికిత్సలకు కంటి రోగులు సుమారు 100 మందికి చికిత్సలు చేశారు. వారిలో 35 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. వీరికి ఉచితంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు చెంగారెడ్డి, చంద్రశేఖరన్‌, దొరస్వామి, శ్రీనివాస్‌, ఫృద్వీరాజ్‌, గోవిందు, ఆనందజెట్టి, బలరాంజెట్టి తదితరులు పాల్గొన్నారు.

26న గణతంత్ర వేడుకలకు సర్వం సిద్దం

Tags: Response to the eye clinic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *