Corona patients at home

మరో పది రోజుల్లో  కోవిడ్ పరిస్థితి మేరకు సాధారణ వైద్య సేవలు పునరుద్దరించండి

-రుయా ఆసుపత్రిలో పోస్ట్ కోవిడ్ ఓపి ప్రారంభించండి

-ప్రవేట్, ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పనిసరి కోవిడ్ పరీక్షలు చేసుకోవాలి

– కోవిడ్ టాస్క్ పోర్స్ కమిటీ

Date:29/10/2020

తిరుపతి ముచ్చట్లు:

జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుతున్న కారణంగా  మరో  పది రోజులు పరిస్థితి సమీక్షించి ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో  సాధారణ, అత్యవసర వైద్య సేవలు పునరుద్దరించాలని ,అలాగే వెంటనే పోస్టు కోవిడ్ ఓ.పి.ని   రుయాలో ప్రారంభించాలని ఉపఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి , పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సూచించారు.గురువారం ఉదయం  స్థానిక నగరపాలక కార్యాలయంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో కోవిడ్ నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త  పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో జిల్లాలో కోవిడ్ నివారణకు తీసుకున్న చర్యలు వివరించారు. జిల్లాలో 79,800 కేసులు ఇప్పటి వరకు నమోదు అయిందని  గత మార్చి  నుండి 3 వేల టెస్టుల సామర్థ్యం నుండి నేడు 7 వేల మందికి టెస్టులు  చేసే స్థాయి పెరింగిందని ప్రభుత్వ, ప్రవేట్ కోవిడ్ ఆసుపత్రులలో, కేర్  సెంటర్లలో  కోవిడ్ పేషెంట్ల సంఖ్య తగ్గిందని వివరించారు. రుయాలో ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిందని వ్వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 2800 వరకు యాక్టివ్ కేసులు మాత్రమే వున్నాయని తెలిపారు. నిన్న స్విమ్స్ లో, రెండురోజుల ముందు రుయాలో మెదటి సారిగా జిల్లాలో జీరో డెత్ నమోదు అయిందని తెలిపారు.

 

 

ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ  డాక్టర్ల వైద్య సేవలు బాగా అందిస్తున్నారని, రోగులకు ధైర్యం చెప్పడంలో విఫలమవుతున్నారని తెలిపారు. అవగాహన, దైర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి మాట్లాడుతూ  నవంబర్ 02 నుండి స్కూల్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు కోవిడ్ టెస్ట్ తప్పనిసరి అని, నెగిటివ్ రిపోర్ట్ ఆధారంగానే విధులు నిర్వహించాలని, చిన్నపిల్లలు బడికి వస్తున్నారనేది గమనించాలని అన్నారు. కేసులు తగ్గుముఖం దృష్ట్యా మరో పది రోజుల్లో జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో కోవిడ్ సేవలు నిలిపి సాధారణ సేవలు అందించాలని, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో శాసనసభ్యులు నవాజ్ భాషా సూచన మేరకు కోవిడ్ వార్డుతో పాటు , గైనకాలజీ పునరుద్ధరణ కు చర్యలు  తీసుకోవాలని సూచించారు. రుయాలో గతంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఏదైనా సమస్యలు తలెత్తితే పోస్టు కోవిడ్ వార్డు ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతిలో తిరుచానూరు, పద్మావతీ నిలయం మినహా మిగిలిన టీటీడీ సత్రాలు టీటీడీ కి అప్పగించాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్ కేసులు తగ్గినందున సానిటేషన్ చేపట్టి  వారు కూడా సాధారణ సేవలకు రావాలని సూచించారు. కుప్పం పీఈఎస్ వైద్య కళాశాలలో కోవిడ్ సేవలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, తీరు మారాలని లేదంటే చర్యలు తప్పవని సూచించారు. రుయా, మదనపల్లి ఏరియా ఆసుపత్రి, కుప్పం పి .ఈ. ఎస్. లలో కోవిడ్ సేవలు కొనసాగాలని మిగిలినవన్ని సాధారణ వైద్య సేవల్లోకి రావాలని సూచించారు.

 

 

 

ఈ సమీక్షలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు  రెడెప్ప, మదనపల్లి శాసన సభ్యులు నవాజ్ భాషా , ఆర్డీఓ కనక నరసా రెడ్డి, రుయా సూపరింటెండెంట్ భారతి, డీ ఎం హెచ్ ఓ పెంచలయ్య , ఎస్. వి. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ జయభాస్కర్, డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ ఓ అరుణ సులోచనా దేవి, డి సి హెచ్ ఎస్. సరలమ్మ,  తుడా సెక్రటరీ లక్ష్మి, డ్వామా పి డి చంద్రశేఖర్, ఆరోగ్యశ్రీ కొ ఆర్డినేటర్ బాలాంజనేయులు , ఐ.ఎం.ఎ. ప్రతినిధులు ,  వైద్య అధికారులు పాల్గొనగా, డా.రవి ప్రభు కోవిడ్ డెత్ ఆడిట్ పై, ఐఎంఎ కృష్ణ ప్రశాంతి  ఐ సి ఎం ఆర్ గైడ్ లైన్స్ మేరకు అందిస్తున్న కోవిడ్  సేవలను కమిటీకి వివరించారు.

ఏఎస్పీ సాయి చైతన్య ఆధ్వర్యంలో మెగా రక్తదానం

Tags: Restore general medical services to the extent of the Kovid condition in another ten days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *