వీధి జంతువులపై ఆంక్షలు కఠినతరం

Date:13/12/2019

నెల్లూరు ముచ్చట్లు:

నగరంలో ట్రాఫిక్ అంతరాయాలకు, రోడ్లు ప్రమాదాలకు కారణమవుతున్న వీధీ జంతువుల పై ఆంక్షలను కఠినతరం చేస్తూ, రోడ్లపై సంచరించే పశువులను శాశ్వతంగా గోశాలల్లో ఉంచేలా చర్యలు తీసుకుటున్నామని నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ ప్రకాటించారు.  నగర వ్యాప్తంగా సంచార జంతువులను గోశాలలకు తరలించే ప్రక్రియను శుక్రవారం కమిషనర్ ఆధ్వర్యంలో ఆరోగ్యశాఖాధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గతంలో నిర్భంధించిన జతువులకు జరిమానాలు విధించి వదిలేసే విధానం ఉండిందని, అయితే ప్రస్తుతం అలాంటి  ఉదాసీన చర్యలకు ఏమత్రం అవకాశం లేదని స్పష్టం చేసారు. ముందస్తు హెచ్చరికగా భావించి పశువుల యజమానులు  వాటిని తమ సంరక్షణలో ఉంచుకోవాలని, లేదంటే రోడ్లపై సంచరించే ప్రతీ జంతువును శాశ్వతంగా   గోశాలకు తరలించేస్తామని హెచ్చరించారు. ఒకసారి గోశాలకు తరలించిన జంతువును తిరిగి వడుదల చేసే అవకాశం ఏ మాత్రం ఉండబోవన్న విషయం జంతువుల యజమానులు గుర్తించాలని కమిషనర్ స్పష్టం చేశారు.

 

అమరవీరులకు నివాళులు

 

Tags:Restrictions on street animals are tightened

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *