శ్రీశైలం లో ఆర్జిత సేవలు పునః ప్రారంభం

శ్రీశైలం ముచ్చట్లు:

 

: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం లో కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆర్జిత సేవలు కరోనా కారణంగా నిలుపుదల చేశారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం తో సోమవారం(12.07.2021) నుండి శ్రీ స్వామి అమ్మవార్ల ఆర్జిత సేవలు పునః ప్రారంభం కానున్నట్లు ఇఓ కె.ఎస్.రామారావు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, పరిమిత సంఖ్యలో ఆర్జిత సేవల నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆన్-లైన్ ద్వారా మరియు కరెంటు బుకింగ్ ద్వారా ఆర్జిత సేవా టిక్కెట్లు పొందవచ్చు.  శ్రీ స్వామి వారికి సామూహిక అభిషేకాలు, అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపములో కుంకుమార్చనలు, గణపతి  హోమం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం,చండీ హోమం సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణం జరిపించుకునే అవకాశం ఉంటుందన్నారు.  సామూహిక అభిషేకాలు మరియు కుంకుమార్చనలు విడతల వారీగా జరగనున్నాయి. అభిషేక భక్తులకు స్వామి వారి అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది.   పరోక్ష సేవలు కూడా యధావిధిగా కొనసాగనున్నాయి.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Resumption of acquired services in Srisailam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *