సమస్యల పరిష్కారానికే భూముల రి సర్వే
గూడూరు ముచ్చట్లు:
భూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రీ సర్వే కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని అలాగే చుక్కల భూమి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు వెల్లడించారు చిల్లకూరు తాసిల్దార్ కార్యాలయం వద్ద వైయస్సార్ జగనన్న భూ హక్కు సంరక్షణ పథకం కార్యక్రమం లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. చిల్లకూరు మండలం తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు సంరక్షణ పథకం భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా ఎమ్మెల్యే వరప్రసాద్ రావు ఆర్డిఓ కిరణ్ కుమార్ హాజరయ్యారు 622 మంది కి భూ హక్కు పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాద్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయరంగానికి పెద్ద పీట వేసి అనేక పథకాలు అమలు చేస్తున్నారని 100 సంవత్సరాల తర్వాత భూమి రీ సర్వే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు అనేక సంవత్సరాలుగా ఉన్న భూ సమస్యలు దీనివల్ల పరిష్కారమవుతాయని చుక్కల భూమి సి జి ఎఫ్ ల్యాండ్స్ సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని వెల్లడించారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను అపహాస్యం చేసేలా మాట్లాడారని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని గుర్తుచేశారు ఆర్డీవో కిరణ్ కుమార్ మాట్లాడుతూ భూమి సర్వే ద్వారా ఎన్నో సంవత్సరాలుగా ఉన్న భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ భూ సమస్యల ద్వారా వల్ల గ్రామాల్లో గొడవలు శాంతిభద్రతలు కూడా విగాతం కలిగాయని 1000 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూమి సర్వే కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు ఊటుకూరు యామిని,మన్యం శ్రీనివాసులు,వైసీపీ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి,తాళ్లూరు శ్రీనివాసులు,భక్తవత్సల రెడ్డి,బత్తిని విజయ్ కుమార్,పరంధామ రెడ్డి,తాసిల్దారు లీలారాణి, స్వర్ణ,అన్ని మండలాల ఎంపీడీవోలు వైసిపి నాయకులు రైతులు పాల్గొన్నారు .

Tags; Resurvey of land to solve problems
