విశ్రాంత బ్యాంకు అధికారి ఆత్మహత్య

Date:03/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని విశ్రాంత బ్యాంకు ఏజిఎం శ్రీరాములు (65) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం పోలీసుల కథనం మేరకు పట్టణంలోని ఎంఎస్ ఆర్ థియేటర్ వద్ద నివాసం ఉన్న శ్రీరాములు వ్యాపారాలలో రూ.6.50 కోట్లు నష్టాలు రావడంతో మనస్థాపానికి గురై గురువారం రాత్రి ఇంటిలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి కోలారు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

గ్రామాల్లో కరోనా నియంత్రణ చర్యలు

Tags: Retired bank officer commits suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *