Retired police officers who joined YSSRCP in the presence of Peddi Reddy

పెద్దిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపిలో చేరిన విశ్రాంత పోలీస్‌ అధికారులు

Date:16/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు విశ్రాంత పోలీస్‌ అధికారులు రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో బుధవారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విశ్రాంత ఎస్‌ఐలు రమణ, నాగప్ప, ఏఎస్‌ఐలు బేగ్‌, మనోహర్‌, కృష్ణయ్య, వెంకట్రమణలు కలసి తమ అనుచరులతో పార్టీలో చేరారు. విశ్రాంత పోలీసులకు మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. అలాగే పట్టణానికి చెందిన తెలుగుదేశం నాయకులు నరేంద్ర, గౌస్‌షరీఫ్‌, నదీమ్‌, సోమశేఖర్‌, బాబు తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విశ్రాంత ఎస్‌ఐ రమణ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వము పోలీసుల సంక్షేమాన్ని కాంక్షించకపోవడం జరిగిందన్నారు. కానీ ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలీసుల సంక్షేమానికి వీక్లీ ఆఫ్‌లు ఇవ్వడం , వారి కుటుంభాలను ఆదుకోవడం అభినందనీయమన్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు విశ్రాంత పోలీసులు , వారి కుటుంబ సభ్యులు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డెప్ప, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అక్కిసాని బాస్కర్‌రెడ్డి, కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, మున్సిపల్‌ ఉద్యోగకార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, అంజుమన్‌ సెక్రటరీ అమ్ము తదితరులు పాల్గొన్నారు.

19న ముస్లింలు బహిరంగ సభ

Tags: Retired police officers who joined YSSRCP in the presence of Peddi Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *