శ్రీవారి ఆలయంలో 65 ఏళ్ళు పైబడిన పనిచేసే వారికి పదవీ విరమణ

Retirement for those who work over 65 years at Shrivar Temple

Retirement for those who work over 65 years at Shrivar Temple

Date:19/05/2018
తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి ఆలయంలో పనిచేసే మిరాసీలకైనా, సన్నిధి గొల్లలకైనా 65సంవత్సరాలు పైబడిన వారికి పదవీ విరమణ తప్పనిసరి అని నూతన పాలకమాండలి ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ అన్నారు. టీటీడి ప్రైవేటు బ్యాంకులో చేసిన డిపాజిట్ ల గురించి, త్వరలో చేయబోయే డిపాజిట్ల గురించి ఒక సబ్ కమిటీ ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. డిపాజిట్ల పై కూలంకషంగా చర్చించి నివేదికను చేయాలని సబ్ కమిటీకి సూచించామని చైర్మన్ పేర్కొన్నారు. సబ్ కమిటీకి సంబంధించిన పూర్తి వివరాలను జూన్ 5 వ తేదీన జరగబోయే పాలకమండలి సమావేశంలో తెలియజేస్తామని చైర్మన్ తెలిపారు. శ్రీనివాస మంగపురంలోని కల్యాణ వెంకటేశ్వర అలయం, చంద్రగిరిలోని కోదండ రామస్వామి దేవాలయంలో ప్రతి నేల పునర్వసు నక్షత్రంలో ఆర్జిత కళ్యాణోత్సవానికి బోర్డ్ సభ్యులు ఆమోదం తెలిపింది.ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అధికారులపై చేసిన విమర్శపై వారికి నోటీసులు జారిచేసి వివరణ కోరుతామన్నారు. ఆయన చేసిన విమర్శల అంశాలపై పూర్తిగా అవగాహన తెచ్చుకొని వారికి వివరణ ఇస్తామని టీటీడీ ఈవో తెలిపారు. మిరాసి అర్చకులైన, సన్నిధి గొల్లలకైనా వంశ పరంపర్యంగా తీసుకున్న కూడా వారికి ఉన్న అర్హత ప్రకారమే టీటీడీ ఉద్యోగిగా తీసుకుంటాం అని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు.
Tags; Retirement for those who work over 65 years at Shrivar Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *