రిటర్న్ గిఫ్ట్ ఫ్రం బ్యాక్ డోర్

Return gift from back door
Date:16/04/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాజకీయాల నుంచి తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా తుడిచిపెట్టే వ్యూహంతో మొదలు పెట్టిన గులాబీ బాస్ ఎత్తుగడలు ఏపీ లో కూడా ఆ పార్టీ ని అధికారానికి దూరం చేసేలా సాగాయన్నది అందరికి తెలిసిందే. తగుదునమ్మా అంటూ తమ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడితే చూస్తూ ఊరుకోకూడదని భావించిన కెసిఆర్ బృందం పక్కా వ్యూహాన్ని ఎపి రాజకీయాలపై అమలు చేసింది. చంద్రబాబు కు రిటర్న్ గిఫ్ట్ తప్పదని ఒక పక్క కెసిఆర్, నే వస్తా చంద్రుడు అంటూ అసదుద్దీన్ ఒవైసి చేసిన ప్రకటనలతో టిడిపి వారిపై యుద్ధం చేసేలా చేసింది.అయితే తెలంగాణ నేతలు ఎపి లో ప్రచారంలోకి దిగుతారని టిడిపి భావించి దానికి అనుగుణమైన వ్యూహాలతో ఎదురు దాడికి దిగింది. కానీ తన వ్యూహం ప్రకారం కెసిఆర్ అండ్ టీం ఎపి టిడిపిలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు వారి ఆస్తులు లిస్ట్ లను సేకరించారు. హైదరాబాద్ లో ఎవరెవరికి వ్యాపారాలు ఉన్నాయి..? వాటి కి సంబంధించిన మెటీరియల్ సిద్ధం చేసి స్వయంగా కెటిఆర్ రంగం లోకి దిగి ఆయన యంత్రాంగం ద్వారా వత్తిడి వివిధ రూపాల్లో దిగారని టిడిపి శ్రేణులు వాపోతున్నాయి.
వందలు వేలకోట్లరూపాయలు హైదరాబాద్ దాని చుట్టుపక్కల స్థలాలు, గృహాలు ఇతర వ్యాపారాలు కలిగిన అభ్యర్థులకు ఒక పద్ధతి ప్రకారం వెళితే వైసిపిలోకి వెళ్ళాలి లేదా టిడిపి గుర్తుపై పోటీ చేసినా సైలెంట్ కావాలని వచ్చిన వార్నింగ్ లతో చాలా నియోజకవర్గాల్లో టిడిపి డబ్బు పంపిణి, ప్రచార కార్యక్రమాలను మందకొడిగా చేసినట్లు సమాచారం. అందుకే నేరుగా ప్రచారం చేయకుండానే బ్యాక్ డోర్ నుంచి గులాబీ టీం టిడిపికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసినట్లు ప్రచారం గట్టిగానే సాగుతుంది.తూర్పు గోదావరి జిల్లా కు చెందిన ఒక నేతకు హైదరాబాద్ సమీపంలోని మానేపల్లి లో 450 ఎకరాల స్థలం ఉందని ఆ స్థలం లిటిగేషన్ లో పడకుండా ఉండాలంటే ఎన్నికల్లో ఇంట్లో కూర్చోవాలని ఆదేశాలు వచ్చాయని ఆయన అనుచరగణం వాపోయింది. దాంతో తమ నేత సైలెంట్ కాక తప్పలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపి అభ్యర్థి సుమారు రెండుకోట్ల రూపాయలు జనసేన అభ్యర్ధికి ఇచ్చి ఓట్ల చీలిక తెచ్చి తన వరకు అయినా నాలుగు ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
ఇక కృష్ణా జిల్లా గన్నవరం నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశి సైతం రిటర్న్ గిఫ్ట్ బెదిరింపులు బహిరంగంగా చెప్పారు. హైదరాబాద్ లోని తనకు చెందిన 100 ఎకరాల భూమి ప్రభుత్వానిది అని బోర్డు పెడతామని హెచ్చరికలు వచ్చాయని వాపోయారు. అయితే లిటిగేషన్ ఎదుర్కోవడానికే వంశీ సిద్ధంకావడంతో ప్రత్యర్థిపై నువ్వా నేనా అని ఫైట్ చేయగలిగారు. ఇలా మెజారిటీ శాతం అభ్యర్థులకు రిటర్న్ గిఫ్ట్ అందేసినట్లు పోలింగ్ ముగియగానే టిడిపి అధిష్టానం గుర్తించింది అంటున్నారు.
Tags: Return gift from back door

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *