Return of coolies from other states beginning to Telangana

తెలంగాణ కు మొదలైన ఇతర రాష్ట్రాల కూలీల తిరిగి రాక

– తొలివిడతలో 300 కూలీల రాక

Date:08/05/2020

రంగారెడ్డి ముచ్చట్లు:

దేశవ్యాప్త౦గా లాక్ డౌన్ అమలు నేపథ్యంలో వలస కూలీలు తమ స్వ-రాష్ట్రాలకు తరలి వెళ్తుండగా తెలంగాణా రాష్ట్రానికి మాత్రం ఇతర రాష్ట్రాలనుండి కూలీలరాక ప్రారంభమైంది. తొలివిడతగా నేడు బీహార్ రాష్ట్రంలోని ఖగారియా నుండి ప్రత్యేక శ్రామిక్ ఎక్సప్రెస్ రైలులో హైదరాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్ కు దాదాపు 300 మందివలస కూలీలు  చేరుకున్నారు.  దేశంలోని అన్ని రాష్ట్రాలనుండి కూలీలు తమతమ రాష్ట్రాలకు తరలివెళ్తుండగా తెలంగాణా రాష్ట్రానికి మాత్రం రివర్స్ లో కూలీలు రావడం ప్రారంభమైంది.  తొలి విడతగా బీహార్ నుండి హైదరాబాద్ కు వచ్చిన 300  మంది వలస కూలీలకు రాష్ట్ర పౌర సరఫరాల శాకా మంత్రి గంగుల కమలాకర్, సంస్థ ఛైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు చైర్మన్ పళ్ళ రాజేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ తదితరులు పూలతో స్వాగతం పలికారు.

 

 

 

ఈ వలస కూలీల రాక ఏర్పాట్లను వలస కూలీల రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్. సైబరాబాద్ సీ.పీ సజ్జనార్ లు స్వయంగా పర్యవేక్షించారు. శ్రామిక రైలులో వచ్చిన కూలీలతో ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలను ప్రత్యేకంగా నిర్వహించారు. వైద్య్ పరీక్షలు నిర్వహించిన అనంతరం కూలీలను తాము కోరుకున్న జిల్లాలకు పంపించామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ తెలియ చేశారు. ఈ కూలీలందరికి వాటరు, ఫుడ్ ప్యాకెట్లు, మాస్కులు, శానిటైసర్లను కూడా అందచేసి కరోనా నుండి కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేశామని అన్నారు.

 

 

 

కాగా, నగరానికి వచ్చిన ఈ కూలీలలో 60 మందిని నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాలకు, 25  మందిని కరీంనగర్, కామారెడ్డి,  జగిత్యాల లకు, పెద్దపల్లి,  సుల్తానాబాద్ 129 మందిని, మరో 25  మందిని మంచిర్యాల, కాగజ్ నగర్ లకు, 20  మందిని సిద్దిపేటకు ప్రత్యేక బస్సులలో అధికారులు తరలించారు. కూలీల తరలింపులో రైలులో భౌతిక దూరం పాటించేలా రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వీరిని తాము కోరుకున్న ప్రదేశాలకు తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దళాలు ఏర్పాటు చేసిన గట్టి బందోబస్తు ద్వారా వచ్చిన ఈ కోల్లెలను తమ గమ్య స్థానాలకు చేరవేయడంలో కూడా పోలీస్ శాఖ తగు జాగ్రత్తలను తీసుకుంది.

 

 

రైస్ మిల్లులో పనిచేసేందుకై……

రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని రైస్ మిల్లులలో పనిచేయడానికి ఇతర రాష్ట్రాలనుండి పెద్ద ఎత్తున కూలీలు వస్తున్నారని దీనిలో భాగంగా తొలివిడతలో 300 మంది కూలీలు హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చారని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, రాష్ట్రంలో విస్తృత ఉపాధి అవకాశాలు. ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తుండడం, వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూత తదితర కారణాల వల్ల తెలంగాణ  రాష్ట్రానికి కూలీల రాక ప్రారంభమైందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణాకు వచ్చే ఇతర రాష్ట్రాల కూలీలందరి సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని ఆయన తెలిపారు.

విశాఖ బాదితులకు 24 గంటల్లో రూ.30 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్‌

Tags: Return of coolies from other states beginning to Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *